అధికార పరిమితులను గుర్తించాల్సిన బాధ్యత పాలకులదన్న పోప్

నవంబర్ 9 అర్జెంటీనాలోని Palacio Libertadలో ప్రసంగించిన పోప్ లియో , భిన్నాభిప్రాయాలను గౌరవిస్తూ పరస్పరం కలిసి జీవించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు.

అధికారంలో ఉన్నవారు తమ అధికార పరిమితులను గుర్తించి, స్వప్రయోజనాలకు కాకుండా సమాజంలోని ప్రజలందరి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరికీ తమ శ్రమ ద్వారా జీవనోపాధి పొందే అవకాశాలు కల్పించాలని, ముఖ్యంగా యువత తమ మాతృభూమిని విడిచిపెట్టకుండా తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. 

ఆర్థిక వ్యవస్థ మానవుని సంక్షేమానికి ఉపయోగపడాలే తప్ప, మానవుడు ఆర్థిక వ్యవస్థకు బానిస కాకూడదని స్పష్టం చేశారు. 

అలాగే, ఇంకా జన్మించని శిశువులతో సహా ప్రతి ఒక్కరి జీవితానికి, గౌరవానికి విలువనివ్వాలని పిలుపునిస్తూ అర్జెంటీనాలో తన తొలి రోజు పర్యటనను ముగించారు.

Telugu Survey Popup Image