రోమ్ మేత్రాసనానికి నలుగురు నూతన పీఠాధిపతులు నియామకం
రోమ్ మేత్రాసన పీఠాధిపతియైన పోప్ లియో నలుగురు గురువులను సహాయక పీఠాధిపతులుగా అభిషేకించారు
అందరికీ అందుబాటులో ఉండాలని, దేవుని సాన్నిధ్యాన్ని ప్రకటించాలని పోప్ వారిని కోరారు.
సెయింట్ జాన్ లాటెరాన్ ఆర్చ్బసిలికాలో జరిగిన దివ్యబలి పూజలో పోప్ లియో సందర్భంగా Stefano Sparapani, Alessandro Zenobbi, Andrea Carlevale, and Marco Valenti అనే నలుగురు గురువులను రోమ్ మేత్రాసన సహాయక పీఠాధిపతిగా నియమించారు.
తన ప్రసంగంలో, పోప్ నూతన సహాయక పీఠాధిపతులను "ప్రియమైన సోదరులారా" అని సంబోధించారు.
మీరు కార్డినల్ వికార్తో కలిసి "రోమ్ లోని ప్రజలకు మంచి కాపరిగా ఉండటానికి మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న దేవుని పవిత్ర ప్రజలందరి ప్రేమను కాపాడటానికి" సహాయపడాలని పోప్ కోరారు.
పోప్ లియో వారి పరిచర్యను తాను ఎలా ఊహించుకుంటున్నారో కూడా వివరించారు:
"మీరు శాంతి మరియు ఐక్యత గల వ్యక్తులైతే, మీ పరిచర్యలో ప్రవక్తలుగా జీవించ గలరు అని పోప్ అన్నారు.
ఈ మేత్రాసనం యొక్క విశాలమైన మరియు జనసాంద్రత గల ప్రదేశాలను ఏకం చేస్తూ, భేదాలను సమన్వయం చేస్తూ, స్వాగతిస్తూ, వారి మాటలను వింటూ, క్షమిస్తూ ఉంటారు." కృప మరియు కరుణ మార్గాలను ఎంచుకోవాలి అని పోప్ అన్నారు