CCBI సోషల్ అపోస్టోలేట్ కోఆర్డినేటర్‌గా గురుశ్రీ మాదాను అంతోని నియామకం

హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ మాదాను అంతోని ని భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CCBI)కి సోషల్ అపోస్టోలేట్ కోఆర్డినేటర్‌గా నియమించారు
బెంగళూరులో మే 6 మరియు 7, 2025 తేదీలలో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం మరియపురంలో డిసెంబర్ 16, 1982న జన్మించారు
తత్వశాస్త్రం, వేదాంతశాస్త్రం, విద్య మరియు మానవ వనరులలో బలమైన విద్యా ప్రావీణ్యత కలిగి ఉన్నారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయం తత్వశాస్త్రం (Philosophy)లో అండర్ గ్రాడ్యుయేట్ పట్టాను మరియు బెంగళూరులోని సెయింట్ పీటర్స్ పోంటిఫికల్ సెమినరీలో వేదాంత అధ్యయనాలను పూర్తి చేశారు.
మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, కౌన్సెలింగ్‌లో డిప్లొమా, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్-ఉపాధ్యాయ శిక్షణ కోర్సును మరియు
ఇటీవల, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మానవ వనరుల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాను పొందారు.
గురుశ్రీ అంతోని 2012లో హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ హై స్కూల్‌లో అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌గా తన పాస్టోరల్ పరిచర్యను ప్రారంభించారు.
హోలీ ఫ్యామిలీ విచారణ - త్రిముల్గెర్రీ; హోలీ ట్రినిటీ విచారణ - బేగంపేట; మరియు మౌంట్ కార్మెల్ విచారణ - బోవెన్‌పల్లితో సహా వివిధ దేవాలయాలలో సేవలందించారు.
2018 నుండి 2021 వరకు, ఆయన సుల్తాన్ బజార్‌లో విచారణ గురువుగా పనిచేశారు.
2021 నుండి హైదరాబాద్ అగ్రపీఠ సోషల్ సర్వీస్ సొసైటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా తన సేవను అందిస్తున్నారు, వివిధ కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.
గురుశ్రీ అంతోని సామాజిక సేవతో పాటు, కౌన్సెలింగ్ వర్క్‌షాప్‌లు, లెంటెన్ రిట్రీట్‌లు నిర్వహించడంలోప్రసిద్ధి చెందారు.
ఆయన ట్యూలిప్ మేనేజ్‌మెంట్ నుండి ప్రాజెక్ట్ ప్రతిపాదన రచనలో శిక్షణ మరియు KKID వారి రక్షణ విధాన శిక్షణను పూర్తి చేశారు.
ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు తమిళం బాషలలో నిష్ణాతులు.
గురుశ్రీ అంతోని గారికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం తరుపున హార్దిక శుభాకాంక్షలు