ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న ద్రాక్షారామం కనోషియన్ సభ సిస్టర్స్

ప్రభు యేసుని ప్రేమను చాటుతున్న ద్రాక్షారామం కనోషియన్ సభ సిస్టర్స్

విశాఖ అతిమేత్రాసనం, ద్రాక్షారామం విచారణ, తోటపేటలో గల కనొస కాన్వెంట్ - కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ (Canosian sisters) ఆధ్వర్యంలో పేద విధవరాలకు ఆహారం మరియు టవల్స్ పంపిని చేసారు. విచారణ కర్తలు గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు, విచారణ సహాయక గురువులు గురుశ్రీ విమల్ రాజ్ గారు, కనొస కాన్వెంట్ - కనోషియన్ డాక్టర్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఇంచార్జ్ సుపీరియర్ సిస్టర్ దీప గారు మరియు ఇతర సిస్టర్స్ కలసి 100 మంది సభ్యులకు పైగా పేద విధవరాలకు మరియు పేదలకు ఆహారం మరియు టవల్స్ పంపిణీ చేశారు.

సోమవారం నాడు అనగా సెప్టెంబర్ 23, 2024 న సిస్టర్ కాన్వెంట్ లో ఈ కార్యక్రమం జరిగింది. కనోషియన్ సిస్టర్స్ "ప్రభు యేసుని ప్రేమను" వారు చేస్తున్న పనులలో చూపిస్తూ ప్రతి సంవత్సరం విచారణ మరియు చుట్టుపక్కల ఉన్న పేదలు, పేద విధవరాల కొరకు ప్రత్యేక ప్రార్థనలు మరియు సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

గురుశ్రీ జోసెఫ్ ప్రభాకర్ గారు కనోషియన్ సిస్టర్స్ చేస్తున్నసేవలను కొనియాడుతూ వారిని అభినందించారు.


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer

 

 

 

 

Telugu Survey Popup Image