ఈ పండుగ క్రీస్తు పునరుత్థాన పండుగ తరువాత ఆదివారమున జరుపుకోవాలని పరిశుద్ధ రెండవ జాన్ పౌల్ పాపుగారు పిలుపునిచ్చారు
దివ్య కారుణ్యం అనగా, 'దేవుని కరుణ' అని అర్ధం. 'కరుణ' అనే తెలుగు మాటకు ఆంగ్లములో Mercy అని అంటారు.
దివ్యకారుణ్య అపోస్తరాలుగా పిలువబడే పునీత ఫౌస్తీనమ్మగారి మాటలలో చెప్పాలంటే, ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మూడు:
దేవుని కరుణను కోరుకోవడం,
యేసుని అనంత కరుణను నమ్మడం,
మనం పొందిన/పొందుతున్న ఆ దేవుని కరుణను పంచడం.