IYCS నూతన సెక్రటరీ జనరల్
మంగళూరు మేత్రాసనానికి చెందిన అడ్వకేట్ రోషన్ మెల్విన్ లోబో గాను హోలీ సీ మరియు ఐక్యరాజ్యసమితిచే గుర్తింపు పొందిన గ్లోబల్ కాథలిక్ యాక్షన్ మూవ్మెంట్ - ఇంటర్నేషనల్ యంగ్ కాథలిక్ స్టూడెంట్స్ (IYCS) సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
తను పారిస్‌లోని IYCS ప్రధాన కార్యాలయం నుండి పని చస్తున్నారు.
జోర్డాన్‌లో మే 16 నుండి 26, 2024 వరకు జరిగిన 17వ IYCS వరల్డ్ కౌన్సిల్లో సెక్రటరీ జనరల్‌గా ఎన్నికయ్యారు.
1984–1986 వరకు హైదరాబాద్ అగ్రపీఠానికి చెందిన మిస్టర్ జాన్ సిడామ్ మరియు 2003–2007 వరకు కలకత్తా అగ్రపీఠానికి చెందిన శ్రీ మనోజ్ మాథ్యూ కూడా IYCS అంతర్జాతీయ సెక్రటరీ జనరల్‌గా తమ సేవను అందించారు .
1998 జనవరి 28న జన్మించిన రోషన్ గారు,సెయింట్ అలోసియస్ కళాశాల నుండి బి.కాం, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ లా నుండి LL.B., పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్శిటీ నుండి MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో మరియు బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుండి రాజ్యాంగ మరియు పరిపాలనా చట్టంలో LL.M. అభ్యసించారు .
ప్రస్తుతం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ లా నందు అనుబంధ ఫ్యాకల్టీ సభ్యుడుగా పనిచేస్తునారు.
యంగ్ స్టూడెంట్స్ మూవ్మెంట్ యొక్క మేత్రాసన ఎగ్జిక్యూటివ్ కమిటీ (DEXCO) ప్రెసిడెంట్ వంటి పాత్రలతో సహా, క్యాథలిక్ యువతా ఉద్యమంలో అతనికి విస్తృతమైన ప్రమేయం ఉంది,
YCS/YSM ఇండియా జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడుగా, జాతీయ YCS |YSM న్యూస్‌లెటర్ 'ది సెర్చ్' ఎడిటర్, మరియు పోలాండ్లోని క్రాకోలో జరిగిన ప్రపంచ యువతా దినోత్సవం 2016 వంటి అంతర్జాతీయ ఫోరమ్‌లలో మరియు చైనాలోని బీజింగ్‌లో ప్రపంచ యువతా పార్లమెంట్ 2017 లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు