సి.సి.బి.ఐ దైవార్చన విభాగ నూతన కార్యదర్శిగా గురుశ్రీ రుడాల్ఫ్ పింటో నియామకం

బెంగళూరు, 11 సెప్టెంబర్ 2024 న భారతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య  దైవార్చన విభాగ నూతన కార్యదర్శిగా నిష్పాదక కార్మెల్ సభ కర్ణాటక ప్రావిన్స్ సభ్యుడు గురుశ్రీ రుడాల్ఫ్ రాజ్ పింటో, O.C.D. గారిని నియమించడం జరిగింది. 

ఈ నియామకం సెప్టెంబర్ 10-11 వరకు బెంగళూరు నందు భారతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య CCBI కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో జరిగింది.

సెప్టెంబరు 1, 1976న మంగళూరు,గురుపూర్‌లో జన్మించిన.

కందవరలోని పాంపీ ప్రాథమిక పాఠశాలలో తన విద్యను ప్రారంభించారు మరియు మంగళూరు, కిన్నికాంబ్లాలోని రోసా మిస్టికా ఉన్నత పాఠశాలలో తన ఉన్నత విద్యను పూర్తి చేసారు. 

మార్గవోలోని కార్మెలైట్ మొనాస్టరీలో తన నోవిటియేట్ మరియు మైసూరులోని పుష్పాశ్రమలో తాత్విక అధ్యయనాలను పూర్తి చేసి, నిష్పాదక కార్మెల్ సభలో చేరారు. 

2004 డిసెంబర్ 28న మంగళూరులోని బికర్నకట్టేలోని కార్మెల్ హిల్‌లో గురువుగా అభిషేకింపబడ్డారు.

ఫాదర్ గారు కార్వార్ మేత్రాసనంలో హొన్నావర్‌లోని శాన్ సాల్వడోర్ చర్చిలో సహాయక విచారణ గురువుగా; మతదకేరి, హొన్నావర్, కార్వార్‌లోని సెయింట్ సెబాస్టియన్ చర్చి విచారణ కర్తగా  మరియు హొన్నావర్‌లోని స్టెల్లా మారిస్‌లో సుపీరియర్ గా, రాణిపుర, మంగళూరులో డైరెక్టర్ మరియు సుపీరియర్‌గా తన సేవను అందించారు.

బెంగుళూరులోని క్రీస్తు జ్యోతి కళాశాల, విజ్ఞాననిలయం: ఏలూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలిజియన్, మంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇంటర్‌డియోసెసన్ సెమినరీ మరియు మైసూర్‌లోని ధ్యానసాధన, ధ్యానవన, రిషివనానిటీ ఇన్‌స్టిట్యూట్‌లతో సహా అనేక ఇన్‌స్టిట్యూట్‌లలో  దైవార్చన విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేసారు.