సిరో-మలబార్ చర్చి మేజర్ అగ్రపీఠాధిపతులుగా శంషాబాద్ పీఠాధిపతి మహా పూజ్య రఫైల్ తట్టిల్ ఎన్నిక.
కేరళ రాష్ట్రం, కొచ్చి, కక్కనాడ్ చర్చి ప్రధాన కార్యాలయంలో కొట్టాయం అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మాథ్యూ మూలకట్ గారు విలేకరుల సమావేశంలో జనవరి 10 సాయంత్రం 4:30 గంటలకు ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ ఎన్నిక జనవరి 8న కాకనాడ్లో ప్రారంభమైన చర్చి సినడ్ సమావేశంలో జరిగింది.
పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ల మంది ప్రజలు కలిగి ఉన్న చర్చికు నూతన నాయకుడిగా బిషప్ రఫైల్ తట్టిల్ ను ఆమోదించారు.
డిసెంబరు 7న ఓరియంటల్ చర్చి పదవికి రాజీనామా చేసిన కార్డినల్ జార్జ్ అలెంచెర్రీ తర్వాత ఈ బాధ్యతలు బిషప్ రఫైల్ స్వీకరించారు
మహా పూజ్య రఫైల్ తట్టిల్ గారు 2018 నుండి శంషాబాద్ ఎపార్కీకి పీఠాధిపతిగా తన సేవలు అందిస్తున్నారు. అంతకుముందు, తను త్రిచూర్ సహాయక పీఠాధిపతిగా ఉన్నారు.
తను 21 ఏప్రిల్ 1956న ఒసేఫ్ మరియు థ్రెసియా దంపతులకు జన్మించారు మరియు 30 ఏప్రిల్ 1956న త్రిసూర్‌లో జ్ఞానస్నానం పొందారు.
త్రిస్సూర్‌లోని సెయింట్ థామస్ కాలేజ్ HSలో అతని ప్రాథమిక విద్య తర్వాత, అతను 04 జూలై 1971న థోప్లోని సెయింట్ మేరీస్ మైనర్ సెమినరీలో చేరారు.
తన తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్ర అధ్యయనాన్ని 1980లో, కొట్టాయం సెయింట్ థామస్ గురువిద్యాలయములో పూర్తి చేసారు.
21 డిసెంబర్ 1980న త్రిస్సూర్, డోలౌరెస్ బాసిలికాలో మార్ జోసెఫ్ కుందుకులంచే గురువుగా అభిషేకింపబడ్డారు.
రోమ్ నగరంలో ఉన్నత చదువులు చదివి ఓరియంటల్ కానన్ లాలో డాక్టరేట్ పొందారు.
10 ఏప్రిల్ 2010న త్రిచూర్ సహాయక పీఠాధిపతిగా మరియు బ్రూనీకి శీర్షిక పీఠాధిపతిగా నియమించబడ్డారు .
2014లో, టెరిటోరియం ప్రొప్రియం వెలుపల నివసిస్తున్న సిరో-మలబార్ విశ్వాసుల కోసం అపోస్టోలిక్ సందర్శకుడిగా నియమించబడ్డారు.
పోప్ ఫ్రాన్సిస్ గారు 10 అక్టోబర్ 2017న శంషాబాద్‌లోని సిరో-మలబార్ కాథలిక్ ఎపార్కీకి మొదటి పీఠాధిపతిగా నియమించి మరియు 7 జనవరి 2018న అభిషేకింపబడ్డారు.