సమగ్రతకు, వైకల్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్న పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్


వ్యక్తుల సాధికారతకు, న్యాయం, సార్వత్రిక సౌలభ్యత, సంఘీభావానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వారి సమగ్రతకు, వైకల్యాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని జి7 ప్రపంచ నాయకులను కోరిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 

అక్టోబర్ 17వ తేదీన వాటికన్ లో జి7  సమగ్రత మరియు వైకల్య శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి  " సురక్షితమైన, సమగ్ర ప్రపంచాన్ని నిర్మించాలన్న తమ నిబద్ధతకు కృతజ్ఞతలు " అని పాపు ఫ్రాన్సిస్ అన్నారు 

ఇటలీలోని సెంట్రల్ ఉంబ్రియా ప్రాంతంలో మూడు రోజుల సమావేశం తరువాత, సోల్ఫాగానో చార్టర్ సంతకంతో బుధవారం ముగిసింది.

ఈ సోల్ఫాగానో చార్టర్ లో సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవితంలో పూర్తి భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఎనిమిది ప్రాధాన్యతలను ఏర్పాటు చేయడం జరిగింది, ప్రజలతో మమేకం కావడానికి బలమైన నిబద్ధతను వ్యక్తం చేస్తోంది.

వైకల్యం ఉన్న వారికి సేవలను అందించడం అనేది కేవలం సామాజిక సహాయం మాత్రమే కాదు, న్యాయమని అయన అన్నారు. 

దేశాలు గౌరవప్రదమైన ఉపాధి మరియు సాంస్కృతిక అవకాశాలను అందించాలని ఆయన అన్ని దేశాలను కోరారు, మినహాయింపు అనేది వివక్ష యొక్క తీవ్ర రూపం అని హెచ్చరించారు 

చేరికను ప్రోత్సహించడంలో సాంకేతికత యొక్క పాత్రను పాపు గారు గుర్తుచేశారు.

హాని కలిగించే సమూహాలపై సంక్షోభాల ప్రభావాన్ని గుర్తుచేశారు.

వారి అవసరాలకు అనుగుణంగా అత్యవసర ప్రతిస్పందనల కోసం పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరి గౌరవం గుర్తించబడే ప్రపంచం కోసం నిరంతర ప్రోత్సహిదాం అని పాపు గారు జి7 ప్రపంచ నాయకులతో సమావేశాన్ని ముగించారు