శ్రీలంకలో జరిగిన ఈస్టర్ ఆదివారం దాడులపై కొత్త దర్యాప్తును స్వాగతించిన పీఠాధిపతి
శ్రీలంకలో జరిగిన ఈస్టర్ ఆదివారం దాడులపై కొత్త దర్యాప్తును స్వాగతించిన పీఠాధిపతి
2019 ఈస్టర్ ఆదివారం నాడు శ్రీలంకలోని కొలొంబోలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడులపై కొత్త దర్యాప్తు ప్రారంభించినట్లు కొలంబోలోని కొత్త ప్రభుత్వం ధృవీకరించడంతో శ్రీలంకలోని ఒక పీఠాధిపతి న్యాయం కోసం తన ఆకాంక్ష వ్యక్తం చేశారు.
"ఈస్టర్ 2019 దాడులపై సమగ్ర విచారణ జరిపేందుకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనుర కుమార డిస్సనాయకే నేతృత్వంలోని ప్రభుత్వం తన సంకల్పాన్ని ధృవీకరించడం ఖచ్చితంగా శుభసూచకమే... మేము నమ్మకంగా ఉన్నామని చెప్పగలం" అని రత్నపుర పీఠాధిపతులు మహా పూజ్య పీటర్ ఆంటోనీ వైమన్ క్రూస్ అన్నారు.
ఏప్రిల్ 21, 2019 న జరిగిన ఈ దాడులు మూడు దేవాలయాలు మరియు మూడు హోటళ్లను ధ్వంసం చేశాయి, 279 మంది మరణించారు మరియు వందలాది మంది గాయపడ్డారు.
దాడికి పాల్పడిన ఇతర నిందితులను గుర్తించడంలో మునుపటి వారు విఫలమయ్యారని శ్రీలంక ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత కొత్త దర్యాప్తు ప్రారంభించబడింది.
2023లో, భారత ఇంటెలిజెన్స్ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన తర్వాత దాడులను నిరోధించడంలో విఫలమైనందుకు శ్రీలంక సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరియు నలుగురు ఉన్నతాధికారులకు 1.03 మిలియన్ డాలర్లు పైగా జరిమానా విధించింది.
ప్రభుత్వ ప్రతినిధి మరియు విదేశాంగ మంత్రి విజితా హెరాత్ ప్రకారం, బాంబు దాడుల్లో పాల్గొన్న ఎవరికీ చట్టపరమైన బాధ్యత నుండి మినహాయింపు ఉండదని హామీ ఇచ్చారు.
"ఈస్టర్ ఆదివారం దాడులపై క్షుణ్ణంగా విచారణ జరుపుతాం. అన్యాయానికి మార్గం సుగమం చేయబోమని శ్రీలంక ప్రజలకు మేము హామీ ఇస్తున్నాము. మేము ఎవరినీ రక్షించము. ఈ చర్యలకు కారణమైన వారందరినీ చట్టపరమైన మార్గాల ద్వారా న్యాయస్థానం ముందుకు తీసుకువస్తాము, " అని ఆయన అన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను సమర్పించనున్నట్లు హెరాత్ తెలిపారు.
బాంబు దాడి చేసిన వారితో సంబంధం ఉన్న శ్రీలంక ఇంటెలిజెన్స్ చీఫ్ సురేష్ సలాయ్ను అధ్యక్షుడు దిసానాయకే తొలగించిన కొన్ని రోజుల తర్వాత కొత్త దర్యాప్తు ప్రకటన వచ్చింది.
2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇస్లాం తీవ్రవాదులను వెతికి పట్టి ఏరివేస్తానని హామీ ఇచ్చి రాజపక్సే అఖండ మెజారిటీతో గెలుపొందారు.
ఇదిలా ఉండగా, బాంబు పేలుళ్లలో తన ప్రమేయం లేదని సలాయ్ ఖండించాడు మరియు రాజపక్సే పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పదోన్నతి పొందాడు.
ఈ 2019 ఈస్టర్ సండే బాంబు దాడులు పౌరులపై శ్రీలంక చేసిన అత్యంత ఘోరమైన దాడిగా పరిగణించబడింది.
కొలంబో కార్డినల్ మాల్కం రంజిత్ మరియు శ్రీలంక కతోలిక శ్రీసభ స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిచ్చాయి.
వారి ప్రయత్నాల ద్వారా, ఇటలీలోని బోలోగ్నా అగ్రపీఠాధిపతి మహా పూజ్య కార్డినల్ మాటియో జుప్పీ వారి ప్రయత్నానికి మద్దతునిచ్చారు.