వరంగల్ నూతన పీఠాధిపతులు గా మహా పూజ్య విజయ్ పాల్ రెడ్డి గారు నియమితులయ్యారు

వరంగల్ నూతన పీఠాధిపతులు గా  మహా పూజ్య విజయ్ పాల్ రెడ్డి గారు నియమితులయ్యారు .
ప్రస్తుతం వరంగల్ డయోసీసన్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ఫాదర్ దుగ్గింపూడి విజయ పాల్ రెడ్డి  (61)గారిని, వరంగల్ డయోసీస్‌కు కొత్త బిషప్‌గా(పీఠాధిపతులుగా) పరిశుద్ధ లియో పాపు గారు  నియమించారు. ఆయన వరంగల్ డయోసీస్‌కు నాల్గవ పీఠాధిపతులు .


ఫాదర్ విజయ పాల్ రెడ్డి గారు తెలంగాణలోని వరంగల్ జిల్లా, గీసుగొండ మండలం, మానుగొండలో 8 జనవరి 1965న జన్మించారు. ఆయన 1985 నుండి 1987 వరకు మరియు 1988 నుండి 1991 వరకు హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీలో తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రంలో తన చదువును పూర్తి చేశారు. అదే కాలంలో, ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని (1987–1990) పొందారు. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని (1996–1998) పూర్తి చేశారు. ఆయన అన్నామలై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీలను కూడా పూర్తి చేశారు (1995–1996; 1998–1999).


మహా పూజ్య  ఉడుమల బాల గారు విశాఖపట్నం అగ్రపీఠాధిపతులుగా  బదిలీ అయిన తరువాత, 2025 ఏప్రిల్ 5 నుండి ఫాదర్ విజయ పాల్ రెడ్డి గారు వరంగల్ డయోసీసన్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు.
వరంగల్ పీఠాధిపతులుగా నియమితులైన మహా పూజ్య విజయ్ పాల్ రెడ్డి గారికి ఇవే మా  శుభాకాంక్షలు .

Article and design by M Kranthi Swaroop