వంచనను తిరస్కరించి, వినయంతో సేవ చేయమని పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్

పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు వాటికన్‌లో నవంబర్ 10,2024 ఆదివారం త్రికాల ప్రార్ధన ప్రసంగంలో పునీత మార్కు సువార్త పఠనాన్ని గుర్తుచేసుకుంటూ, జెరూసలేం ఆలయంలో యేసు కపటత్వాన్ని ఖండించిన దాని గురించి వివరించారు.

 "వంచనను తిరస్కరించండి, బదులుగా వినయంతో సేవ చేయమని ప్రభువు పిలుపుని" ఫ్రాన్సిస్ పాపు గారు పునరుద్ఘాటించారు.
 
మనం విశ్వాసంగా, ప్రేమగా మరియు విశ్వసనీయంగా ఉందాం కపటుల పట్ల జాగ్రత్త వహిదం.

క్రీస్తు ప్రభువు అధికారం గురించి చాలా భిన్నమైన విషయాలను భోదించారు "స్వీయ త్యాగం మరియు వినయపూర్వకమైన సేవ ఇతరుల పట్ల మాతృత్వం మరియు పితృస్వామ్య వాత్సల్యం చూయించాలని" ఫ్రాన్సిస్ పాపు గారు గుర్తు చేశారు.

అధికార స్థానాల్లో ఉన్నవారు ఇతరులను అవమానపరచకూడదని, వారికి చేతనైన సహాయం చేయాలని  పిలుపునిచ్చారు 

బాధ్యతాయుతమైన రంగాలలో నేను ఎలా ప్రవర్తించగలను? నేను వినయంతో ప్రవర్తిస్తానా, లేక నా పదవిని చూసి గర్వపడుతున్నానా? నేను ఇతరుల పట్ల ఉదారంగా మరియు గౌరవంగా ఉంటానా, లేదా నేను వారితో అసభ్యంగా మరియు అధికారపూర్వకంగా ప్రవర్తిస్తానా? అని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. 

కపటత్వపు ప్రలోభాలను ఎదుర్కోవడానికి, ఇతరులకు మంచి చేయడానికి మరియు సరళంగా ప్రవర్తించడానికి ఆ మరియతల్లిని ప్రార్దిదాం అని పోపు గారు అన్నారు 

Tags