బైబిల్ కోర్సుల ద్వారా విశ్వాసులను బలపరుస్తున్న DCBA
బైబిల్ కోర్సుల ద్వారా విశ్వాసులను బలపరుస్తున్న DCBA
గోవా మరియు డామన్ అగ్రపీఠంలోని "డియోసెసన్ సెంటర్ ఫర్ బైబిల్ అపోస్టోలేట్" (DCBA) పాస్టోరల్ ఇయర్ 2023-2024లో బైబిల్ కోర్సులలో పాల్గొన్న 769 మంది విజయవంతంగా బైబిల్ కోర్సులను పూర్తి చేసారు.
గ్రాడ్యుయేషన్ రోజున, ఐదు పారిష్లు మరియు ఒక మతపరమైన మఠం నుండి పాల్గొన్న వారికి వారి డిప్లొమా సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. పంచవాడిలోని సెయింట్ ఆంథోనీ దేవాలయం లో డిప్లొమా వేడుకకు ముఖ్య అతిధిగా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఫిలిప్ నెరి కార్డినల్ ఫెర్రో గారు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో డియోసిసన్ సెంటర్ ఫర్ బైబిల్ అపోస్టోలేట్ డైరెక్టర్ గురుశ్రీ మరియానో డి’కోస్టా గారు మాట్లాడుతూ “చాలా ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, విచారణల ఈ బైబిల్ కోర్సుల కోసం గురువులు ఎక్కువగా అడుగుతారు. వారే చొరవ తీసుకుని వీటిని నిర్వహిస్తారు. ఆ గురువులే విచారణ ప్రజలలో విశ్వాసాన్ని నింపుతూ ప్రభు యేసుని మార్గంలో నడిపిస్తుంటారు అని అన్నారు.
కోర్సుల సమయంలో కవర్ చేయబడిన ప్రధాన థీమ్ కొత్త నిబంధన. రిసోర్స్ పర్సన్ల ఉపన్యాసాలతో పాటు, పాల్గొనేవారు గ్రూప్ స్టడీస్‌లో నిమగ్నమై రెండు ప్రశ్నాపత్రాలకు సమాధానాలు ఇచ్చారు.
గురుశ్రీ డికోస్టా గారు కోర్సులో పాల్గొనే విశ్వాసుల సందేహాలను తీర్చారు మరియు విచ్ఛిన్నమైన సంబంధాలను చక్కదిద్దే దైవిక జోక్యం యొక్క క్షణాలను కూడా పంచుకున్నారు."అనేక మంది యేసు ప్రభువు యొక్క అంకితమైన అనుచరులుగా ఉద్భవించారు. వారి జీవితాలు ప్రభు యేసుని బోధనల ద్వారా ప్రకాశిస్తూ, లోతైన ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తున్నారు" అని గురుశ్రీ డి'కోస్టా గారు అన్నారు.
వ్యక్తిగతంగా మరియు కుటుంబాలలో బైబిల్ యొక్క ధ్యాన పఠనాన్ని ప్రోత్సహించడం, దేవుని మార్గంలో నడిచేలా విశ్వాసులలో అవగాహన పెంచడం, దేవుని వాక్యం యొక్క శక్తిని వెలికితీసేందుకు వారికి మార్గనిర్దేశం చేయడం మరియు విశ్వాసుల అభివృద్ధిని పెంపొందించడం ఈ కోర్సు లక్ష్యం.
ఈ కోర్సులో పాల్గొన్న సిమిత్రా రోడ్రిగ్స్ మాట్లాడుతూ, “బైబిల్ అధ్యయనంలో చేరడం వల్ల మోక్ష చరిత్ర గురించి లోతైన అవగాహన పొందగలిగాను. బైబిల్లో వివరించిన వివిధ సంఘటనల సందర్భం మరియు ప్రాముఖ్యత నుండి చాల నేర్చుకున్నాను అని అన్నారు.
ఈ కోర్సులను నిర్వహిస్తున్నందుకు డియోసెసన్ సెంటర్ ఫర్ బైబిల్ అపోస్టోలేట్ పట్ల పాల్గొనేవారు తమ కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer