ఫిలిప్పీన్స్‌లో నూతన మేత్రాసనానికి పీఠాధిపతిని నియమించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
అక్టోబరు 15 న పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు సిబు అగ్రపీఠ సహాయక పీఠాధిపతులు మహా పూజ్య రూబెన్ లాబాజో గారిని నూతన మేత్రాసన ప్రాస్పెరిడాడ్ కు మొదటి పీఠాధిపతిగా నియమించారు.
ఫిలిప్పీన్స్‌లోని కతోలిక శ్రీసభ యొక్క గణనీయమైన అభివృద్ధిలో భాగంగా దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న అజిషన్ డెల్ సుర్ లో ప్రాస్పెరిడాడ్ మేత్రాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వాటికన్ ప్రకటించారు.
ఈ ప్రాంతంలో మతసంబంధ సంరక్షణను పెంపొందించడానికి ఈ మేత్రాసన ఏర్పాటు ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణించబడుతుంది.
కొత్తగా ఏర్పాటైన ప్రాస్పెరిడాడ్ మేత్రాసనం అగసాన్ డెల్ నార్టే ప్రాంతాన్ని పర్యవేక్షిస్తుంది.
బుటువాన్ మేత్రానులు మహా పూజ్య కాస్మే డామియన్ అల్మెడిల్లా గత సంవత్సరం దాఖలు చేసిన పిటిషన్‌ను అనుసరించి నూతన మేత్రాసనం ఏర్పాటు చేసారు.
మహా పూజ్య అల్మెడిల్లా ప్రతి ప్రావిన్స్‌లోని కతోలిక విశ్వాసులకు మెరుగ్గా సేవ చేయడానికి "వ్యూహాత్మక చర్య"గా విభజనను ప్రతిపాదించారు.
ఈ నూతన మేత్రాసన ఏర్పాటుకు ఫిలిప్పీన్ల కతోలిక పీఠాధిపతుల సమాఖ్య (CBCP) సమావేశం జూలై 9,2023న ఆమోదం తెలిపింది.
"2024 అక్టోబర్ 15న అధికారికంగా స్థాపించబడిన మేత్రాసనం, ఫిలిప్పీన్స్‌లో 87వ మేత్రాసనం కానుంది.
ఇందులో 26 విచారణలలో 4 86,000 కంటే ఎక్కువ కతోలిక విశ్వాసులకు సేవలు అందిస్తుంది.
ఈ మేత్రాసనం లో 32 మంది మేత్రాసన గురువులు, 29 మంది ఇతర సభ గురువులు, 59 మంది గురువిద్యార్దులను, ఆరుగురు మఠకన్యలు ఉన్నారు