పాపు గారి అధ్యయన బృందానికి ఆసియా ప్రతినిధిగా, సమన్వయకర్తగా కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియాస్ నియామకం.
సెప్టెంబరు 7, 2024 న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు స్థాపించిన కౌన్సిల్ ఆఫ్ కార్డినల్స్ (C9)లో ఆసియా ప్రతినిధిగా ముంబై అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ గారిని అధ్యయన బృందానికి నూతన సమన్వయకర్తగా నియమించారు.
ఈ బృందం ప్రపంచ శ్రీసభ అంతటా పాపల్ ప్రతినిధుల పాత్రలను, విధులను సమీక్షిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపుగారి ప్రతినిదుల మరియు ఇతర వాటికన్ కార్యకలాపాలను, వారి ప్రేషిత కార్యాల మరియు సినడల్ ప్రభావాన్ని సమీక్షించడం ఈ అధ్యయన బృందం యొక్క బాధ్యత.
ఈ బృందంలో సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్, డికాస్టరీ ఫర్ బిషప్‌లు మరియు డికాస్టరీ ఫర్ ఎవాంజలైజేషన్ అధికారులు ఉంటారు.
అక్టోబర్ 2 నుండి 27 వరకు జరగబోయే సినడ్ సమావేశంలో ప్రతి సమూహం యొక్క పని ప్రణాళికల యొక్క సంక్షిప్త అవలోకనాన్ని అందిస్తుంది. ఈ నివేదికలను జూన్ 2025 నాటికి పరిశుద్ధ పాపు గారికి సమర్పించాలని భావిస్తున్నారు.
కార్డినల్ గ్రేసియాస్ గారితో పాటు, అధ్యయన బృందంలో సినడ్ సెక్రటేరియట్ అధిపతిగా ఉన్న కార్డినల్ మారియో గ్రెచ్, పోంటిఫికల్ ప్రతినిధుల కార్యదర్శి మహా పూజ్య లూసియానో రస్సో, పోంటిఫికల్ ఎక్లెసియాస్టికల్ అకాడమీ అధ్యక్షుడు మహా పూజ్య సాల్వటోర్ పెన్నాచియో హోలీ సీ యొక్క దౌత్య సిబ్బందికి శిక్షణ ఇచ్చే బాధ్యత.
రోమ్ నగరంలో అనేక సినడల్ సమావేశాలలో ఈ బృందం అధ్యన పనిని ప్రారంభించింది, సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ అధికారులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతుల సమావేశ నాయకులతో ఈ బృందం నిమగ్నమై ఉంది