పాఠశాలల్లో క్రైస్తవ చిహ్నాలను తొలిగించాలి - ఒక హిందూ సంఘం
భారతదేశంలోని క్రైస్తవుల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో క్రైస్తవ చిహ్నాలను తొలిగించాలి - ఒక హిందూ సంఘం
భారతదేశంలోని ఈశాన్య అస్సాం రాష్ట్రంలోని క్రైస్తవ పాఠశాలలకు మతపరమైన అన్ని క్రైస్తవ చిహ్నాలను తీసివేయాలని హిందూ సమూహం అల్టిమేటం ఇచ్చింది .క్రైస్తవ మిషనరీలు మతమార్పిడి కార్యకలాపాలకు పాఠశాలలను ఉపయోగించకుండా నిరోధించడమే ఈ చర్య లక్ష్యం అని హిందూ సంస్థ కుటుంబ సురక్ష పరిషత్ (కుటుంబ భద్రతా మండలి) అధ్యక్షుడు సత్య రంజన్ బోరా తెలిపాడు.
“క్రైస్తవ మిషనరీలు పాఠశాలలు మరియు విద్యాసంస్థలను మతపరమైన సంస్థలుగా మారుస్తున్నారు. మేము దానిని అనుమతించము, ”అని ఫిబ్రవరి 7న గౌహతిలో విలేకరుల సమావేశంలో అన్నాడు.అస్సాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలన సాగుతోంది.
యేసు ప్రభువు మరియు మదర్ మేరీల స్వరూపాలు లేదా ఛాయాచిత్రాలను తొలగించాలని ఈ హిందూ సమూహం కోరుతోంది. మతపరమైన చిహ్నాలను తొలిగించని పక్షంలో 'భయకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హిందూ గ్రూపు క్రైస్తవ పాఠశాలలను బెదిరించింది. తొలగింపుకు క్రైస్తవ పాఠశాలలకు 15 రోజుల గడువు విధించింది.హిందూ గ్రూపు పాఠశాల సముదాయాలలో ఉన్న దేవాలయాలను కూడా తొలగించాలని కోరింది.
అలాగే క్రైస్తవ పాఠశాలల్లో పనిచేస్తున్న గురువులు, సన్యాసినులు(సిస్టర్స్) మరియు బ్రదర్స్ కూడా పాఠశాల క్యాంపస్లలో మతపరమైన డ్రెస్ (కాసోక్లు) ధరించడం మరియు మతపరమైన అలవాట్లను తక్షణమే నిలిపివేయాలని సత్య రంజన్ బోరా చెప్పాడు.
గౌహతి అగ్రపీఠాధిపతులు మహా పూజ్య జాన్ మూలచిరా గారు మాట్లాడుతూ వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి అని అన్నారు.పేద గిరిజన ప్రజలు నివసించే అస్సాంలోని మారుమూల ప్రాంతాల్లో అనేక దశాబ్దాలుగా క్రైస్తవులు విద్యను అందించడంలో ముందున్నారు అని, ఇటువంటి బహిరంగ బెదిరింపులను పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తానని చెప్పారు.
బిజెపికి చెందిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను సంప్రదించాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర క్రైస్తవ నాయకులు తెలిపారు.దేశంలో హిందూ సమూహాలు సాంస్కృతిక జాతీయవాదాన్ని ముందుకు తెచ్చిన తర్వాత మొత్తం ఈశాన్య భారత ప్రాంతంలో ఇటీవలి సంవత్సరాలలో క్రైస్తవ మతానికి మరియు మిషనరీ కార్యకలాపాలకు బెదిరింపులు పెరిగాయని క్రైస్తవ నాయకులు అంటున్నారు.అస్సాంలోని 31 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు 3.74 శాతం ఉన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer