పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ప్రశంసించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ పాకిస్థాన్

కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ పాకిస్థాన్

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ప్రశంసించిన కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ పాకిస్థాన్

క్రైస్తవ వివాహానికి కనీస చట్టపరమైన వయస్సును 18 ఏళ్లకు పెంచే బిల్లును ఆమోదించినందుకు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఆఫ్ పాకిస్థాన్ (CBCP) ప్రశంసించింది.

13 ఏళ్ల వయస్సులో ఉన్న బాలికలకు మరియు 16 ఏళ్ల వయస్సులో అబ్బాయిలకు వివాహాన్ని అనుమతించే ప్రస్తుత చట్టాన్ని సవరిస్తూ 2024 క్రిస్టియన్ వివాహ చట్టం ఈ నెల ప్రారంభంలో ఆమోదించబడింది

బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు మొత్తం పార్లమెంట్‌కు సిబిసిపి ఒక ప్రకటనలో తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.

“బలవంతపు మతమార్పిడులు మరియు బాల్య వివాహాల నుండి మన యువత మరియు మైనర్ బాలికలను రక్షించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషిస్తుంది. బలవంతపు మత మార్పిడులను నేరం చేసేందుకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము" అని పేర్కొంది.

ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని కాథలిక్ బిషప్‌లు నేషనల్ కమీషన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (NCJP) మరియు ఇతర క్రైస్తవ శాఖలు ఆనందంగా కొనియాడారు.

సెనేటర్ కమ్రాన్ మైఖేల్ 1872 నాటి చట్టాన్ని నవీకరించడానికి గత సంవత్సరం సెనేట్‌లో మొదటిసారిగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు.

 

Article by: Bandi Arvind

Online Content Producer