నూతన నియామకం

8 సెప్టెంబర్ 2024 న హైదరాబాద్ అగ్రపీఠం పునీత అన్నమ్మ- లుజెర్న్‌ సొసైటీ ఆఫ్ సిస్టర్స్ కు నూతన సుపీరియర్ జనరల్‌గా సిస్టర్ పౌలిన్ అగస్టీన్ కంపకతుంకల్ గారు ఎన్నికయ్యారు. 

హైదరాబాద్ అగ్రపీఠం, సికింద్రాబాద్‌లోని పునీత అన్నమ్మ సభ జనరల్‌లేట్‌లో ఈ సభ ఐదవ జనరల్ చాప్టర్ సందర్భంగా ఈ ఎన్నిక జరిగింది 

ప్రస్తుతం సిస్టర్ పౌలిన్ గారు బెంగళూరు ప్రావిన్స్‌కు ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా తన సేవను అందిస్తున్నారు.

సిస్టర్ పౌలిన్ గారు అక్టోబరు 13, 1965న, కేరళలోని తొడుపుళలోని చీనికుజిలో జన్మించిన శ్రీ కె.ఎ.అగస్టిన్ మరియు శ్రీమతి రోసా దంపతుల ఎనిమిది మందిలో ఏడవ సంతానం సిస్టర్ పౌలిన్ గారు. 

సిస్టర్ గారు బ్యాచిలర్ అఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని, ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో ఉపాధ్యాయురాలిగా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. 

సిస్టర్ పౌలిన్ గారు జూన్ 1990లో సొసైటీ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్‌లో చేరారు, నవంబర్ 21, 1994న తన మొదటి మాట పట్టును స్వీకరించారు  

1995లో ఆమె తిరునల్వేలి జిల్లా పనగుడిలోని సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా దశాబ్దం పాటు తన సేవను అందించారు

2006 వరకు చెన్నైలోని మాధవరంలోని సెయింట్ ఆన్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా తన సేవలను కొనసాగించారు. 

2010లో బెంగుళూరు ప్రావిన్స్‌కు ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా ఎన్నికయ్యారు, వరుసగా రెండు పర్యాయాలు ప్రావిన్స్‌కు నాయకత్వం వహించారు. 

సిస్టర్ గారి పదవీకాలం తర్వాత  తమిళనాడులోని పనగుడిలోని సెయింట్ ఆన్స్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నప్పుడు ఒక ICSE పాఠశాల స్థాపనకు నాయకత్వం వహించ్చారు.

ఆమె నాయకత్వ సామర్ధ్యాలు 2023లో మరోసారి బెంగుళూరు ప్రావిన్స్‌కు ప్రొవిన్షియల్ సుపీరియర్‌గా తిరిగి ఎన్నికయ్యారు.

సొసైటీ ఆఫ్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఆన్, లూజెర్న్ 1909లో స్విట్జర్లాండ్‌లో గురుశ్రీ విల్హెల్మ్ మేయర్ గారు స్థాపించారు.

ఈ సభ 1927లో భారతదేశంలో ప్రారంభించి, మూడు ప్రావిన్సుల్లో ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

52 మేత్రాసనాలలో 1,234 మంది సిస్టర్లు తమ సేవను అందిస్తున్నారు.