టోలెడో దైవాంకితులతో సమావేశమైన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్
పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ టోలెడోలోని ఎక్లెసియాస్టికల్ ప్రావిన్స్‌కు చెందిన దాదాపు 120 మంది దైవాంకితులతో నవంబర్ 7,2024 న సమావేశమయ్యారు.
ఈ సమావేశాన్నికి హాజరైన పీఠాధిపతులను మరియు దైవాంకితులను నాలుగు సమూహాల వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని పాపు గారు కోరారు.
మొదటిగా, వారు దేవునికి దగ్గరగా ఉండాలి, తద్వారా “ప్రభువును కనుగొనే సామర్థ్యం పెరుగుతుంది.
” రెండవది గురువు వారి పీఠకాపిరితో పరస్పర సాన్నిహిత్యం పెంచుకోవాలి .
"తమ పీఠాధిపతితో సన్నిహితంగా లేని గురువు అవిటివాడితో సమానం అని," పొప్ గారు హెచ్చరించారు.
మూడవడిగా వారు ఒకరికొకరు సంఘీభావాన్ని కలిగి ఉండాలని దైవాంకితులకు గుర్తు చేశారు,
చివరిగా గురువులు సామాన్యులతో సన్నిహితంగా ఉండాలి.
"మనల్ని నడిపించే క్రీస్తు ప్రభు నుండి మన దృష్టి మలచకూడదు అని,ఆయన కలిసి నడవడం నేర్చుకుంటామని నేను ఆశిస్తున్నాను" అని పోపు గారు తెలిపారు.