"జ్ఞానపు సరిహద్దులను విస్తరించండి, సత్యాన్ని నిరంతరం అన్వేషించండి" ఫ్రాన్సిస్ పాపు గారు

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సెప్టెంబర్ 27,2024 బెల్జియంకు తన అపోస్టోలిక పర్యటనలో భాగంగా రెండవ రోజున బ్రస్సెల్స్ నుండి లెవెన్‌కు వెళ్లి యూరోపియన్  యూనియన్ క్యాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ లెవెన్‌లోని ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు

సత్యాన్ని నిరంతరం అన్వేషించండి మరియు జ్ఞానపు సరిహద్దులను విస్తరించాలని ఉపాధ్యాయులను ఫ్రాన్సిస్ పాపు గారు కోరారు.

లెవెన్‌లోని క్యాథలిక్ యూనివర్సిటీ ఈ ఏడాది 600వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది.

" కతోలిక విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థుల కోసం సమగ్ర నిర్మాణాన్ని అందించాల్సిన అవసరం ఉందని, తద్వారా వారు వర్తమానాన్ని అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేయడం నేర్చుకుంటారు" అని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

సాంస్కృతిక నిర్మాణం ఎప్పుడూ స్థిరంగా ఉండదు కావున ఆలోచనలు మరియు స్ఫూర్తి కొరకు అన్వేషణను కొనసాగిస్తూనే ఉండాలి అని ఆయన అన్నారు.

"విశ్వవిద్యాలయాలను సంస్కృతి మరియు ఆలోచనలను ఉత్పన్నం చేసేవిగా చూడటం చాలా మంచి విషయం,మానవ పురోగమన సేవలో సత్యాన్వేషణలో అభిరుచిని ప్రోత్సహించడం అన్నింటికంటే ముఖ్యం " అని ఆయన అన్నారు.

మన ఆధునిక సమాజం సత్యాన్ని వెతకడానికి నిరాకరిస్తున్నట్లు కనిపిస్తోందని, శోధించే మక్కువను కోల్పోయిందని, సౌలభ్యం కోసం మాత్రమే వెతుకుతున్నామని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.ఈ దృక్పథం "మేధోపరమైన అలసట"కి దారి తీస్తుంది, అది మనల్ని ఎదగ నివ్వకుండా చేస్తుందని అన్నారు .

"సులభమైన, అప్రయత్నమైన మరియు సౌకర్యవంతమైన 'విశ్వాసం' వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా ఉంది," ఆయన వ్యక్తంచేశారు.

మన సరిహద్దులను విస్తరించడానికి సహాయ పడమని దేవున్ని కోరమని పాపు గారు  విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులను కోరారు.   

శరణార్థులను స్వాగతిస్తున్నందుకు ఫ్రాన్సిస్ పాపు గారు క్యాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ లెవెన్‌ను ప్రశంసించారు.

పాపు గారు బలహీనుల పట్ల దయ మరియు సమగ్ర సంస్కృతిని నిర్మించడంలో సహాయపడటానికి విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల్ని ఆహ్వానించారు. 

 "అలుపెరుగని సత్యాన్వేషకులుగా ఉండండి మరియు మీరు మేధో బద్ధకానికి లొంగిపోకుండా జాగరూకులై ఉండండి  అని ఫ్రాన్సిస్ గారు ముగించారు.

Tags