కాశ్మీర్‌లోని కథోలిక పాఠశాల మూసివేత ముప్పును ఎదుర్కొంటోంది
కాశ్మీర్‌లోని కథోలిక పాఠశాల మూసివేత ముప్పును ఎదుర్కొంటోంది
బారాముల్లా జిల్లాలో 119 ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ జోసెఫ్ పాఠశాల లైసెన్స్ రెన్యూవల్ కోసం ఎదురుచూస్తుంది.
భారతదేశంలోని సమాఖ్య పాలనలో ఉన్న జమ్మూ మరియు కాశ్మీర్ భూభాగంలో బ్రిటీష్ కాలం నాటి కథోలికుల పాఠశాల మూసివేయబడే ముప్పును ఎదుర్కొంటోంది. ఎందుకంటే మేత్రాసనం నిర్వహిస్తున్న పాఠశాల యొక్క భూమి లీజును పునరుద్ధరించడంలో ప్రభుత్వం విఫలమైంది.
కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు 3,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న ఈ పాఠశాల ప్రభుత్వ స్థలంలో నిర్మించబడింది. మేము పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసాము, కానీ ప్రభుత్వం నుండి ఇంకా స్పందన రాలేదు అని గురుశ్రీ చాకో గారు ఫిబ్రవరి 5న UCA న్యూస్‌తో అన్నారు.
పునరుద్ధరణ ఆలస్యం కారణంగా, "మేము మా విద్యార్థులను వారి చివరి పరీక్షలకు హాజరు కావడానికి జమ్మూ కాశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌లో నమోదు చేయలేకపోతున్నాము" అని గురుశ్రీ చాకో గారు తెలిపారు.
ప్రస్తుత సంవత్సరం 8వ తరగతి వరకు విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యం అంతర్గతంగా పరీక్షలు నిర్వహిస్తారు. కానీ గ్రేడ్ 9 నుండి 12 వరకు, విద్యార్థులు పేర్లను రాష్ట్ర పాఠశాల విద్యా బోర్డులో నమోదు చేసుకోవాలి, లేని పక్షంలో వారు పరీక్షలకు హాజరయ్యేందుకు అర్హులు కాదు.
మేత్రాసన గురువులు మరియు అధికారులు 9-12 తరగతులకు చెందిన 700 మంది పాఠశాల విద్యార్థులను విద్యా బోర్డుతో నమోదు చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర అధికారులను సంప్రదించారు. ఇది జరిగీతే విద్యార్థులు వారు తమ విద్య సంవత్సరాన్ని కోల్పోరు.
“ఒక నెల క్రితం, మేము ఫెడరల్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్‌ని సంప్రదించాము. మా డిమాండ్‌ను పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినా అధికారులనుండి ఎటువంటి స్పందన లేదు అని చేయలేదని గురుశ్రీ చాకో గారు తెలిపారు.
పరీక్షలకు విద్యార్థులు చేరేందుకు సహకరించేందుకు మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఆశ్రయిస్తామని గురుశ్రీ చాకో గారు తెలిపారు. ఇప్పటికైనా ఆయన ద్వారా పరిష్కార మార్గం దొరుకుతుందనే ఆశతో ఉన్నామని గురుశ్రీ చాకో గారు అన్నారు.
లైసెన్స్ రెన్యూవల్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియజేసింది. తల్లిదండ్రుల సంఘం కూడా విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతి కోసం ప్రభుత్వ అధికారులకు మరియు పాఠశాల విద్యా బోర్డు ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేసింది.
జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతం ఇప్పుడు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని సమాఖ్య ప్రభుత్వంచే నిర్వహించబడుతోంది, ఇది హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ (BJP)చే నడుపబడుతోంది.
జమ్మూ-శ్రీనగర్ మేత్రాసనం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా అంతర్జాతీయ సరిహద్దులచే చుట్టుముట్టబడి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న లాహోర్ మేత్రాసనని విభజించిన తర్వాత 1887 జూలై 6న ఈ మేత్రాసనని ఏర్పాటు చేశారు .
1947లో భారత ఉపఖండంలో బ్రిటిష్ వలస పాలన ముగియడంతో, మతపరమైన భూభాగం కాశ్మీర్ మరియు జమ్మూ ప్రిఫెక్చర్ అపోస్టోలిక్‌గా జనవరి 17, 1952న పునర్వ్యవస్థీకరించబడింది. ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో కేవలం 650 మంది క్రైస్తవులు నివసిస్తున్నారు, ఇక్కడ 2019 వరకు ఇతర భారతీయులు భూమిని కొనుగోలు చేయడం నిషేధించబడింది.మేత్రాసనం లోని చాలా మంది దేవాలయ సిబ్బంది దక్షిణాది రాష్ట్రాలైన కేరళ మరియు తమిళనాడుకు చెందినవారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer