కర్నూలు మేత్రాసనం, కల్లూరులో ఆరోగ్యమాత మహోత్సవం

కర్నూలు మేత్రాసనం, కల్లూరు విచారణలో  9,సెప్టెంబర్ 2024 న ఆరోగ్యమాత మహోత్సవం  ఘనంగా జరిగింది. 

కర్నూలు పీఠకాపరి మాన్యశ్రీ డా.గోరంట్ల జ్వానాస్ OCD గారు మొట్టమొదటిసారిగా కల్లూరు విచారణకు విచ్చేసారు.

విచారణ కర్తలు, విశ్వాసులు, మఠవాసులు మొదటి సారిగా విచ్చేసిన పీఠాధిపతులను ఊరేగింపుతో ఘన స్వాగతం పలికారు.

ఈ వేడుకలో భాగంగా మరియతల్లి స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకొని విచారణ చేరారు

పీఠాధిపతుల వారు ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

వారు తమ ప్రసంగంలో మానవ రక్షణ చరిత్రలో మరియ తల్లి పోషించిన అద్భుతమైన పాత్రను వివరించారు, మనము కూడా ఆ తల్లిని పోలి విశ్వాస జీవితం జీవించి రక్షణ ప్రణాళికలో మనవంతు  పాత్రను పోషించాలని వివరించారు.

15 మంది గురువులు, 10 మంది మఠవాసులు సుమారు 200 మంది విశ్వాసులు ఈ పండుగ పూజలో పాల్గొన్నారు.

తరలివచ్చిన విశ్వాసులకు మరియమాత భక్తులకు, గురువులకు, మఠవాసులకు, దివ్యబలి పూజను సమర్పించిన పీఠాధిపతులకు కల్లూరు విచారణ కర్తలుగురుశ్రీ పసల లహస్త్రాయ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసారు.

హైదరాబాద్ నుండి విచ్చేసిన గాయక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు 

Tags