అర్చక విద్యను పునర్నిర్వచించేందుకు ఈశాన్య భారతదేశ రూపకర్తల సమావేశం
ఈశాన్య భారతదేశం అంతటా ఉన్న మేత్రాసన గురువిద్యాలయాలకు చెందిన ఆచార్యలు / రూపకర్తలు వారి ద్వైవార్షిక సమావేశం అక్టోబర్ 21 నుండి 23 వరకు కోహిమా, మౌంట్ టాబోర్ రిట్రీట్ సెంటర్‌లో సమావేశమయ్యారు.
“వివిధ దశలలో అర్చక నిర్మాణ కొనసాగింపు” అనే నేపథ్యంపై అర్చక ఏర్పాటును మెరుగుపరచడంపై చర్చించారు.
ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి గురు శిక్షణకు వచ్చిన వారికి తగినంత విద్యా లేనందున వారు ఎదురుకుంటున్న సవాళ్లను పరిష్కరించే విధానం పై దృష్టి సారించారు.
ఇటానగర్ విశ్రాంత పీఠాధిపతులు మహా పూజ్య జాన్ థామస్ గారు తన ప్రధాన ప్రసంగంలో, అభ్యర్థులలో విద్యాపరమైన అంతరాలను,పేలవంగా పనిచేస్తున్న పాఠశాల వ్యవస్థల నుండి వచ్చినవారు అని గుర్తుచేస్తూ, వీరికి నిర్మాణాత్మక నివారణ విద్య కొరకు పిలుపునిచ్చారు.
చాలా మంది అభ్యర్థులు పదవ తరగతి పూర్తి చేసి ఉన్నప్పటికీ, వారి వాస్తవ విద్యా నైపుణ్యాలు తరచుగా ప్రాథమిక పాఠశాల స్థాయి కంటే తక్కువగా ఉన్నాయని పీఠాధిపతులు వారు పేర్కొన్నారు.
గురువిద్యార్థులు ప్రాథమిక అంకగణితంతో పోరాడుతున్న సందర్భాలను నివేదించారు, న్యూటన్ లేదా పైథాగరస్ వంటి ప్రముఖ వ్యక్తులను గుర్తించలేకపోయారు మరియు మ్యాప్‌లో వారి స్వంత రాష్ట్రాన్ని గుర్తించడంలో కూడా ఇబ్బంది పడ్డారు.
ప్రాథమిక విద్య లేకపోవడం వారి తాత్విక మరియు వేదాంత భావనలపై వారి అవగాహనకు ఆటంకం కలిగిస్తుంది, చివరికి వారి ప్రేషిత కార్యంపై ప్రభావం చూపుతుంది,
గురువిద్యార్థులు చదవడం, రాయడం మరియు అంకగణితంలో అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం యొక్క ఆవశ్యకతను పీఠాధిపతులు వారు సూచించారు
ఈ అంతరాన్ని తగ్గించడానికి రెమెడీయల్ ఎడ్యుకేషన్‌కు / పరిష్కార విద్యను అవసరమని, దీని కొరకు గణిత శాస్త్రం, జనరల్ సైన్స్ , సామాజిక అధ్యయనాల పాఠ్యపుస్తకాలు తోడుపడతాయి అని మహా పూజ్య జాన్ థామస్రీ గారు అన్నారు
ఈ సమావేశంలో పాల్గొన్నవారు పీఠాధిపతుల ప్రతిపాదనను సమిష్టిగా ఆమోదించారు, ఈ విద్యాపరమైన లోటులను పరిష్కరించడానికి వారి సంబంధిత మేత్రాసనాలలో ముందస్తు నిర్మాణ కార్యక్రమాలను చేయడానికి అంగీకరించారు.
వివిధ నిర్మాణ దశలలోని రెక్టార్‌లు వారి అవసరాలను తెలియపరుస్తూ, కాలానుగుణంగా నవీకరించే మార్గాలను కూడా చర్చించారు.
వారి మేత్రాసనాలలో అర్చక విద్య పునాదిని బలోపేతం చేయడానికి ఈశాన్య భారతదేశ రూపకర్తల మధ్య ఐక్య నిబద్ధతను సూచిస్తూ ఈ సమావేశంముగిసింది.