"బాధితుల ప్రాణ రక్షకులు"గా ఉండమని శస్త్రవైద్యులను ఆహ్వానించిన పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్

ఫ్రాన్సిస్ పాపు గారు ఇటీవల “రోమ్‌లోని ఇటాలియన్ సొసైటీ ఆఫ్ సర్జరీ యొక్క 126వ జాతీయ కాంగ్రెస్ సందర్భంగా "బాధితుల ప్రాణ రక్షకులు"గా ఉండమని శస్త్రవైద్యులను ఆహ్వానించారు.

" దేవుని రూపంలో సృష్టించబడిన ఓ మనిషికి  మీరు చికిత్స చేయాల్సి వచ్చినపుడు, మీరు ఏ విధంగా మెరుగైన చికిత్స పొందాలి అనుకుంటున్నారో అదే శ్రద్ధతో ఇతరులతో వ్యవహరించాలి " అని పాపు  గారు అన్నారు.

ప్రాణాలను కాపాడేందుకు, వారి సంరక్షణకు శస్త్రవైద్యులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు మరియు వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆధునిక వైద్యం కొన్నిసార్లు శరీరాన్ని "కేవలం శాస్త్రీయ పరిశోధన మరియు సాంకేతిక వస్తువుగా మారుస్తుంది," అని అతను చెప్పాడు.

శస్త్రచికిత్స అనేది కృత్రిమ మేధస్సుతో సహా అనేక కొత్త సాంకేతికతలపై ఆధారపడినా చికిత్స చేసే సమయంలో వైద్యుని చేతులను ఏదీ భర్తీ చేయలేదని ఆయన అన్నారు

వైద్యులు మానవతా విలువలను పెంపొందించాలని ఆయన శస్త్రవైద్యులను ప్రోత్సహించారు. 

వైద్యులుగా "మీ పని మరియు మీ లక్ష్యం ఎల్లప్పుడూ ముఖ్యమైనది: అందువల్ల నేను  "బాధితుల ప్రాణ రక్షకులు"గా ఉండమని మిమల్ని ఆహ్వానిస్తున్నాను అని ముగించారు.