విశ్వాసానికి కట్టుబడి ఉండండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

 విశ్వాసానికి కట్టుబడి ఉండండి - పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

లాటిన్ అమెరికా కోసం పొంటిఫికల్ కమిషన్‌తో కలిసి లయోలా యూనివర్సిటీ చికాగో నిర్వహించిన "బిల్డింగ్ బ్రిడ్జెస్ అక్రాస్ ఆసియా పసిఫిక్ ఇనిషియేటివ్"(Building Bridges Across Asia Pacific initiative)లో విద్యార్థులతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడారు. ఆన్లైన్ లో   జరిగిన ఈ సమావేశంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పాల్గొన్నారు.

లయోలా యూనివర్శిటీ చికాగో బిల్డింగ్ బ్రిడ్జెస్ ఇనిషియేటివ్ (BBI)ని ప్రారంభించింది, ఇది విద్యార్థి-కేంద్రీకృత మరియు విశ్వవిద్యాలయ-వ్యవస్థీకృత ఈవెంట్‌ల శ్రేణి, ఇది ఫ్రాన్సిస్ పాపు గారి  సినాడాలిటీకి చేసిన పిలుపు నుండి ప్రేరణ పొందింది. మొదటి సమావేశం ఫిబ్రవరి 2022లో "బిల్డింగ్ బ్రిడ్జెస్ నార్త్-సౌత్" పేరుతో జరిగింది. రెండవది, "బిల్డింగ్ బ్రిడ్జెస్ అక్రాస్ ఆఫ్రికా", అదే సంవత్సరం నవంబర్‌లో జరిగింది. దీనిలో  సబ్-సహారా ఆఫ్రికా అంతటా విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భముగా విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలపై ముఖ్యంగా  మానసిక ఆరోగ్యం, వివక్ష, కళంకాలు మరియు గుర్తింపు గురించి  ఫ్రాన్సిస్ పాపు గారు చర్చించారు.

ఆసియాకు చెందిన యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన సంభాషణలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ "మీ స్వంత నమ్మకాలను ఎల్లప్పుడూ దృఢంగా విశ్వసించండి" అని అన్నారు.  ఒంటరిగా ఉండటం వల్ల చెడు అలవాట్లు మరియు సమస్యలకు దారితీస్తుందని ఫ్రాన్సిస్ పాపు గారు  హెచ్చరించారు.

విశ్వాసంలో విద్యావంతులు కావడం మరియు  "నిజమైన" క్రైస్తవులుగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను పాపు గారు నొక్కిచెప్పారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సమర్థవంతమైన విద్య గురించి కూడా చర్చించారు.

ప్రతి ఒక్కరు వారి  స్వంత గుర్తింపును కలిగి ఉండటంపై దృష్టి పెట్టండి అని ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు మరియు  అక్కడ ఉన్న వారందరినీ ఎల్లప్పుడూ ఒకరికొకరు సహకరించుకోవాలని మరియు ఐక్యంగా ఉండమని ప్రోత్సహించారు.

మహిళల గొప్పతనాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు అని కొనసాగించారు. కొన్ని సమయాల్లో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తున్నారని, ఇది నిజం కాదని ఆయన అందరికీ ఈ సందర్భముగా గుర్తు చేశారు.మహిళల గొప్పతనాన్ని మరచిపోకూడదు అని, వారి అంతర్దృష్టి మరియు కమ్యూనిటీలను నిర్మించడంలో వారి సామర్థ్యం పరంగా పురుషుల కంటే మహిళలు మెరుగ్గా ఉన్నారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

చివరగా, "నిరాశ, నిస్సహాయ ప్రపంచంలో, మనం మన విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని "  గత విషాదాల గురించి మరింత అవగాహన కల్పించాలని, భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకోవాలని మరియు శాంతి కోసం పని చేయాలని  పిలుపునిచ్చారు.

 


Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer