'క్రీస్తు పరిమళాన్ని' వ్యాప్తి చేయాలి : ఫ్రాన్సీస్ పాపు గారు
'క్రీస్తు పరిమళాన్ని' వ్యాప్తి చేయాలి : ఫ్రాన్సీస్ పాపు గారు
క్రీస్తు పరిమళాన్ని వ్యాప్తి చేయాలని తైమూర్ మతాధికారులకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు. మరియు అవినీతి యొక్క తప్పుడు భావాలకు దూరంగా ఉండాలని వారిని కోరారు.
సెప్టెంబరు 10న తైమూర్ దేశ రాజధాని దిలీలోని "కేథడ్రల్ ఆఫ్ ది ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్"లో స్థానిక మతాధికారులను, దేవాలయ కార్యకర్తలను , డీకన్లు మరియు గురువిద్యార్థులను ఉద్దేశించి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తైమూర్-లెస్టే "ప్రపంచం అంచున" ఉన్నప్పటికీ, ఇది "సువార్త మధ్యలో" ఉందని, ప్రపంచంలోని కతోలికులు అత్యధికంగా ఉన్న చిన్న దేశం అయినప్పటికీ ఇది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది అని అన్నారు.
ప్రభువు మన జీవితాన్ని పరిమళింపజేసిన ప్రేమను మనం కాపాడుకోవాలి అని, తద్వారా అది దాని వాసనను కోల్పోదు" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు . క్రీస్తు మరియు ఆయన సువార్త యొక్క సువాసనను ” మనం సంరక్షించవలసిన మరియు వ్యాప్తి చెందడానికి మనకు లభించిన అవకాశం అని, ఇది ఒక బహుమతి” అని ఆయన చెప్పారు.
తైమూర్-లెస్టేలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పునరుత్థానంపై నమ్మకం మరియు చనిపోయిన వారి ఆత్మల పట్ల గౌరవం వంటి వారి సంస్కృతిలోని కొన్ని “అందమైన” అంశాలను విలువైనదిగా ఉంచాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారిని ప్రోత్సహించారు.
మద్యపానం, హింస మరియు మహిళల పట్ల గౌరవం లేకపోవడం మరియు బాధలను సృష్టించే ప్లేగులు, ఇతర వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు వారికి పిలుపునిచ్చారు.
చివరిగా ఒక గురువు “ఎల్లప్పుడూ ఆశీర్వదించాలి, ఓదార్చాలి, కరుణకు ప్రతినిధిగా మరియు దేవుని దయకు చిహ్నంగా ఉండాలి అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు. పేదరిక స్ఫూర్తితో మరియు సేవా స్ఫూర్తితో ప్రభువుతో కలిసి ఉందాం" అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer