ఆస్ట్రేలియాలో దాడి పట్ల విచారణ వ్యక్తం చేసిన పోప్ లియో

డిసెంబర్ 14న ఆస్ట్రేలియాలోని బోండి బీచ్‌లో జరిగిన దాడిలో గాయపడిన వారికి తన సానుభూతిని వ్యక్తం చేస్తూ సిడ్నీ అగ్రపీఠాధిపతికి టెలిగ్రామ్ పంపిన పోప్ లియో 

కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్‌ను సిడ్నీ అగ్రపీఠాధిపతి ఆంథోనీ ఫిషర్ కు పంపారు.

"Hanukkah వేడుకకు సమావేశమైన యూదు సంఘసభ్యులను" కోల్పోవడం ఎంతో బాధాకరం,ఈ అర్థరహిత హింసా చర్య వలన బాధపడుతున్న వారందరికీ పోప్ లియో తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం చేశారు. 

తమ కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖిస్తున్న వారికి ఓదార్పు, ఈ విషాదం నుండి ఇంకా కోలుకుంటున్న వారికి తన ప్రార్థనలు చేశారు.

ఆస్ట్రేలియన్లందరికీ దైవిక ఆశీర్వాదాలు మరియు శాంతి నెలకొనాలని ప్రార్థిస్తూ పోప్ ఈ  టెలిగ్రామ్ ను ముగించారు