ఆనందంతో క్రీస్తు సువార్తను ప్రకటించండి-పోప్ లియో

Christ with joy

 

ఆనందంతో క్రీస్తు సువార్తను ప్రకటించండి-పోప్ లియో 

బ్యూనస్ ఎయిర్స్, నవంబర్ 10: అర్జెంటీనాలో తన రెండవ రోజు పర్యటనను   ముగించే క్రమంలో పరిశుద్ధ లియో పాపు గారు, క్రీస్తు ఇచ్చిన సువార్తను ఆనందంతో ప్రపంచానికి ప్రకటించాలన్న పిలుపును స్వీకరించాలని అర్జెంటీనా ప్రజలకు పిలుపునిచ్చారు.

అర్జెంటీనాలో తన రెండవ రోజు పర్యటనను ముగించే సందర్భంగా నవంబర్ 9వ తేదీ రాత్రి బ్యూనస్ ఎయిర్స్‌లోని అపోస్టోలిక్ న్యూన్షియేచర్ (పాపల్ రాయబార కార్యాలయం) వెలుపల గుమిగూడిన విశ్వాసులను పరిశుద్ధ లియో పాపు గారు పలకరించారు. తనకు స్వాగతం పలికిన ప్రజల ఉత్సాహం, ఆనందం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పరిశుద్ధ లియో పాపు గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి హృదయాలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభువు ఆశీర్వాదం లభించాలని ఆకాంక్షించారు. క్రీస్తు మనలను పిలుస్తున్నాడనే ఆనందాన్ని మనమందరం ఎల్లప్పుడూ అనుభవించాలని అన్నారు.

"ప్రతి ఒక్కరూ ఆనందంతో సువార్తను ప్రకటించడానికి పంపబడినవారే” అని పరిశుద్ధ లియో పాపు గారు పేర్కొన్నారు.

అర్జెంటీనాలో తన రెండవ రోజు పర్యటనలో పరిశుద్ధ లియో పాపు గారు ప్రధానంగా దాతృత్వ సేవ, కుటుంబ జీవితం, మానవ గౌరవం, క్రైస్తవ విశ్వాస బాధ్యతలపై దృష్టి సారించారు.

క్లేపోల్‌లోని డాన్ ఒరియోనే సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగుల గౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. యువత దాతృత్వ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు.

మన ప్రభువైన యేసు క్రీస్తును కేంద్రంగా చేసుకొని, ఆయన ప్రేమను మరియు సువార్త సందేశాన్ని ఆనందంతో ప్రపంచానికి చాటడమే ప్రతి క్రైస్తవుని బాధ్యత అనే సందేశాన్ని పరిశుద్ధ లియో పాపు గారు తన రెండవ రోజు పర్యటన ముగింపులో మరోసారి గుర్తుచేశారు

Article and Design BY M Kranthi Swaroop

 

Telugu Survey Popup Image