మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుక

సెప్టెంబర్ 21,2024 న హైదరాబాద్,లకిడికపూల్, అశోకా హోటల్ వేదికగా మహమ్మద్ ప్రవక్త జయంతి కార్యక్రమం జరిపారు.

మహమ్మద్ ప్రవక్త మానవాళికి ప్రభోదించిన శాంతి, సద్భావాన, సామరస్యం వంటి అంశాలు నేటి సమాజానికి ఎంతో ఆవసరమని స్కారల్, రచయిత స్వామి లక్ష్మీ శంకరాచార్య పేర్కొన్నారు. 

ప్రవక్త ఆచరించిన దాతృత్వం, ధార్మిక చింతన, సర్వమానవాళి ఐక్యత వంటి బోధనలు ఆచరిస్తే సమాజంలో శాంతి, సద్భావానతోపాటు అన్ని రంగాల్లో సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. 

ఈమేరకు అశోకా హోటల్ వేదికగా మహమ్మద్ ప్రవక్త జయంతి కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన విచ్చేసి ప్రసంగించారు. 

ఇస్లాం కత్తితో కాదని, కరుణతో విస్తరించిందని, ప్రపంచ మానవాళికి ఆదర్శమన్నారు. 

ప్రవక్త  క్షమాగుణం తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకమని ఈ మేరకు తాను పుస్తకం రచించానని వెల్లడించారు.ఇస్లాం శాంతి, సామరస్యాలను భోదిస్తోందని, ఉగ్రవాదం, హింసకు ప్రొత్సాహించదన్నారు. 

తెలుగు కాథలిక్ బిషప్ కౌన్సిల్ కార్యదర్శి కొండవీటి అంతయ్య , వక్తలు ఇంతియాజ్, ముభషీర్ ఆహ్మద్, ఇక్బాల్ ముల్లా తదితరులు పాల్గొన్నారు.
 

Tags