సకల ఆత్మల సంస్మరణ మహోత్సవము
సకల ఆత్మల సంస్మరణ మహోత్సవము (2 నవంబర్)
ప్రతి సంవత్సరం నవంబర్ 2 వ తేదీన మరణించిన క్రైస్తవులందరి ఆత్మలు కొరకు ఆల్ సోల్స్ డే ను ఆచరిస్తారు .దీనినే ఉత్తరించు (స్థల) ఆత్మల పండుగ అని అంటారు .
ముఖ్యంగా కుటుంబములో చనిపోయిన వారి కొరకు ఇది జరుపుకుంటారు .మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మల కోసం ప్రార్థించే రోజు ఇది. కతోలిక ఆచారం చొప్పున విశ్వాసుల విన్నప ప్రార్ధనలు ప్రార్ధించుట , సమాధుల స్థలాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, జపమాల మరియు పాటల మధ్య గురువు పవిత్ర తీర్ధజలాలతో సమాధులను ఆశీర్వదించడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో విశ్వాసులు ప్రదక్షిణగా సాయంకాలం సమాధుల వద్దకు వెళ్లి ప్రార్ధనలు చేసుకొంటూ క్రొవ్వొత్తులు, దీపాలు వెలిగిస్తారు. అవి వెలిగినంత సేపు రాత్రిళ్ళు సందర్భోచిత గుర్తుగా వెలుగుతూనే ఉంటాయి.