యువ సద్భావ్ -2024
పశ్చిమ భారత రాష్ట్రమైన గోవాలో ఆగస్టు 3న “సద్భావ్” (మనః పూర్వకము) సదస్సుకు తొమ్మిది కళాశాలల నుండి 90 మంది విద్యార్థులు హాజరయ్యారు.
'యువ సద్భావ్' అనేది విభిన్న విశ్వాసాలు మరియు నమ్మకాల గల యువకుల సంభాషణలు, సంబంధాలను నిర్మించడం, విశ్వాసం మరియు అవగాహనను పెంపొందించడం మరియు ఉమ్మడి మేలు కొరకు ఏర్పాటుచేసిన అంతర్ విశ్వాస ప్రాజెక్ట్.
'యువ సద్భావ్' మార్చి 2022లో ప్రారంభించబడిన ప్రాజెక్ట్ మతపరమైన అవగాహనను పెంపొందించడం, పక్షపాతాన్ని అధిగమించడం మరియు సంఘీభావాన్ని పెంపొందించడం ద్వారా యువతలో నిజమైన పరస్పర చర్యను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని సొసైటీ ఆఫ్ పిలార్ సభ్యుడు, కన్వీనర్ గురుశ్రీ ఎల్విస్ ఫెర్నాండెజ్ తెలిపారు.
పిలార్ సొసైటీ ఒక స్వదేశీ సభ.
వివిధ విశ్వాసాలు గల వ్యక్తుల మధ్య నమ్మకం, గౌరవం మరియు సహకారంతో స్నేహ పూరిత సమాజాన్ని సృష్టించడం యువత వల్లనే అవుతుందని ఫెర్నాండెజ్ గారు తెలిపారు.
వివిధ విశ్వాస సమూహాలు మరియు విద్యావేత్తలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు వక్తలు సభను ఉద్దేశించి ప్రసంగించారు.