బాలల దినోత్సవం
బాలల దినోత్సవం
“నేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు. వారిని మనం పెంచే విధానం దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది - జవహర్‌లాల్ నెహ్రూ
నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు.
పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ బాలల అభివృద్ధికి & విద్యకు చేసిన విశేషమైన కృషి ఆయన జయంతి సందర్భంగా బాలల దినోత్సవ వేడుకలకు జన్మనిచ్చింది . కాబట్టి, ప్రతి సంవత్సరం, నవంబర్ 14 మన ప్రేమగల “ చాచా నెహ్రూ ” కి నివాళులర్పించడానికి అంకితం చేయబడిన రోజు . నెహ్రూకు పిల్లలపై ఉన్న అభిమానం మరియు ప్రేమ కారణంగా "చాచా నెహ్రూ" అని పిలిచేవారు .
నవంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ 1964లో జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా గుర్తించాలని భారత పార్లమెంటులో తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఆయన జయంతి సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.