ఘనం గా జాతీయ యువత ఆదివారం


ఘనం గా జాతీయ యువత ఆదివారం

జాతీయ యువత ఆదివారం సందర్భముగా  కైలాసపురం విచారణ, వేలాంగణిమాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురుశ్రీ సంతోష్  CMF, గారి ఆద్వర్యం లో  ఈ వేడుకలు జరిగాయి. విచారణ సుపీరియర్ గురుశ్రీ జాన్ గారు పాల్గొని యువతీ యువకుల కొరకు ప్రత్యేకించి ప్రార్థనలు జరిపారు.

విచారణ యువతీ,యువకులు కు ప్రత్యేక ఆరాధనను గురుశ్రీ సంతోష్ గారు జరిపించారు.   "యువత  శ్రీసభకు మంచి  సైనికుల  లాగా  ఉండాలని, శక్తివంతమైన ప్రార్థన  జీవితం  జీవించాలి"  అని సూచించారు. యువతీ, యువకులకు  ఆటలపోటీలు ఏర్పాటు  చేసి  సదస్సుని  మరింత  ఉత్సాహం గా  మార్చారు. సుమారు  50 మంది యువతీ,యువకులు  ఈ  కార్యక్రమం లో  పాల్గొన్నారు.

విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ ప్రేమ్ కుమార్ ఈ కార్యక్రమం ముఖ్యఅతిథి గా లో పాల్గొని ఇతర గురువులతో కలసి పరిశుద్ధ దివ్యపూజాబలిని సమర్పించారు.  
యవ్వన కాలమందు యువత ప్రభు మార్గంలో నడవాలని గురుశ్రీ ప్రేమ్ కుమార్ గారు సూచించారు.

యువతంతా ఏకమై  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. విచారణ  గురుశ్రీ సంతోష్  ,గురుశ్రీ జాన్, గురుశ్రీ ప్రేమ్ కుమార్  గారికి  యూత్  అందరి  తరుపున  ప్రశాంతి   మరియు  నిర్మల  కృతజ్ఞతలు తెలిపారు. విచారణ యువతకు  మార్గచూపరి గా  నిలిచినా సీనియర్ నాయకుడు ఆనంద్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.