ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం

ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవం

ఎల్లప్పుడూ ప్రార్థించండి మరియు జరుగుతున్న యుద్ధాల ముగింపు కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి అని  పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు పిల్లలకు చెప్పారు. శ్రీసభ మొదటి ప్రపంచ బాలల దినోత్సవం ముగింపు సందర్భంగా  ఫ్రాన్సీస్ జగద్గురువులు ప్రసంగించారు.

వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ బసిలికాలో రెండు రోజుల ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిసాయి. దాదాపు 50,000 మంది పిల్లలు మరియు విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 25న రోమ్‌లోని ఒలింపిక్ స్టేడియంలో ఈ కార్యక్రమం ప్రారంభమైనది.

ఫ్రాన్సీస్ జగద్గురువులు మాట్లాడుతూ "ప్రపంచాన్ని సృష్టించిన మన తండ్రి, మానవాళిని రక్షించిన తన ప్రియమైన కుమారుడైన యేసు ప్రభువు  మరియు మన "జీవితంలో మాకు తోడుగా ఉన్న పవిత్ర ఆత్మ సర్వేశ్వరులు ఎల్లప్పుడు మనతో ఉన్నారని  గుర్తు చేసారు."ప్రార్థించడానికి, కలిసి ప్రార్థించడానికి మనము  ఇక్కడ ఉన్నాము అని అన్నారు. పవిత్ర ట్రినిటీ యొక్క అర్ధాన్ని ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులుగా మరియు వారికి ఎందుకు ప్రార్థించడం ముఖ్యం అని పిల్లలకు వివరించారు.
 
ఈ  ప్రపంచంలో  మనమందరం సోదరులు మరియు సోదరీమణులు అని , మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు .

బాలికలు మరియు బాలురు దివ్యబలిపూజ  సమయంలో చురుకుగా పాల్గొనేవారు అని , బలిపీఠం సేవకులుగా పరిచర్య చేయడం, గాయక బృందాలలో పాడటం, విశ్వాసుల ప్రార్థనలతో సహా కొన్ని పఠనాలు  చదవడం మరియు నైవేద్య కానుకలను తీసుకురావడం వంటి  పిల్లల యొక్కవిభిన్న క్షణాలను క్లుప్తంగా మరియు సరళంగా ఫ్రాన్సీస్ జగద్గురువులు వివరించారు.

"దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు," అని అన్నారు. విశ్వాసులు ఎల్లప్పుడూ "జీవితంలో మాతో పాటుగా ఉండమని మరియు ఎదగడానికి సహాయం చేయమని" దేవుని ప్రార్థిస్తాము అని తద్వారా తండ్రి దేవుడు  మనకు సహాయం చేస్తాడు అని మరియు  అతను మనకు దగ్గరగా ఉంటాడు" అని ఫ్రాన్సీస్ జగద్గురువులు  అన్నారు.

మరియు  యేసు ఎల్లప్పుడూ ప్రతిదీ క్షమిస్తాడు, మరియు క్షమాపణ కోరే వినయం మనలో ఉండాలి, అని ఫ్రాన్సీస్ జగద్గురువులు  అన్నారు. పరిశుద్ధాత్మ "మనం చేయవలసిన మంచి పనులను మన హృదయాలలో చెబుతాడు" అని, కష్టాల సమయంలో నమ్మకమైన బలాన్ని మరియు ఓదార్పుని ఇస్తాడు అని గుర్తు చేసారు.

చివరిగా పిల్లలను ఆశీర్వదిస్తూ, ఫ్రాన్సీస్ జగద్గురువులు ఒకరికొకరు ప్రార్థించాలని కోరారు, తద్వారా వారందరూ జీవితంలో ముందుకు సాగాలని, వారి తల్లిదండ్రులు, తాతలు మరియు అనారోగ్యంతో ఉన్న పిల్లల కోసం ప్రత్యేకించి ప్రార్థించాలని కోరారు.
ఎల్లప్పుడూ ప్రార్థించండి మరియు అన్నింటికంటే, శాంతి కోసం ప్రార్థించండి, తద్వారా ఇకపై యుద్ధాలు ఉండవు" అని ఫ్రాన్సీస్ జగద్గురువులు అన్నారు.

అనంతరం, కార్యక్రమానికి హాజరైన పిల్లలను అభినందించారు. తదుపరి ప్రపంచ దినోత్సవం సెప్టెంబర్ 2026లో ఉంటుందని కూడా ఆయన ప్రకటించారు.
ఇటాలియన్ నటుడు మరియు హాస్యనటుడు, రాబర్టో బెనిగ్ని, పిల్లలకు ఒక శక్తివంతమైన "పెప్ టాక్" ఇచ్చారు, అద్భుత కథలను చదవడానికి, సృష్టించడానికి మరియు పంచుకోవడానికి వారిని ప్రోత్సహించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer