ఖమ్మం మేత్రాసన స్థాయిలో యువతా సదస్సు
తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య టీ.సీ.బీ.సీ యువతా విభాగం వారు ఖమ్మం మేత్రాసనం కరుణగిరి పుణ్యక్షేత్రము నందు జులై 17 న మేత్రాసన స్థాయి యువతా సదస్సు నిర్వహించింది.
శ్రీసభ సినదాలిటీ లో యువత పాత్ర అనే నేపథ్యంపై ఈ సదస్సు నిర్వహించారు.
ఉదయం 9 గంటలు ఖమ్మం మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ విజయ్ గారి ఆహ్వాన పలుకులు, జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభంకాగా,
"శ్రీసభలో యువత పాత్ర" మరియు సమాజంలో యువత నిర్మాణం అనే అంశంపై శ్రీ కృష్ణకర్ గారిచే 9 :45 గంటలకు మొదటి సెషన్ జరిగింది
"యువత జీవితంలో ఎదురుకుంటున్న సవాళ్లు: పవిత్రాత్మ ప్రేరణతో నడవడం" అనే అంశంపై యువత డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు.
11:45 గంటలకు "నైతిక జీవితం యొక్క బాధ్యత" అనే అంశంపై మిస్టర్ గుమ్మడి అజయ్ గారి కెరీర్ గైడెన్స్
అనంతరం డీనరీ వారీగా గ్రూప్ డిస్కషన్ జరిగాయి
"ఈ రోజు యవ్వన జీవిత ప్రయాణంలో, ఐక్యత మరియు దైవిక కాంతిని ఆలింగనం చేసుకోవడం" అనే అంశం పై గురుశ్రీ చల్లా డేవిడ్ గారు భోదించారు.
"సినడ్ ఆఫ్ సినడాలిటీ - 'పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్'" అనే అంశం పై గురుశ్రీ బి. జయరాజు, యాసిడ్ గారు వ్యాక్యానించారు
మధ్యాహ్నం 3.30గంటలకు ఖమ్మం పీఠాధిపతులు మహా పూజ్య డా. ప్రకాష్ సగిలి గారిచే దివ్యబలి పూజ సమర్పించడం జరిగింది.
ఖమ్మం మేత్రాసనం లోని వివిధ విచారణల నుండి సుమారు మూడువందల మంది యువతీ యువకులు ఈ సదస్సులో పాల్గొన్నారని యువత డైరెక్టర్ గురుశ్రీ సగిలి ప్రవీణ్ కుమార్ గారు రేడియో వేరితాస్ ఆసియా తెలుగు విభాగం వారికి తెలిపారు.