సెయింట్ పీటర్స్ స్క్వేర్, కొలొనేడ్ కింద నిరుపేదలకు ఉచిత వైద్య సంరక్షణ

నవంబర్ 17వ తేదీ ఆదివారం నాడు 8వ ప్రపంచ పేదల దినోత్సవం పురస్కరించుకుని " దేవుడు మీలో ప్రతి ఒక్కరినీ చూస్తాడు మరియు మీకు దగ్గరగా ఉంటాడు అని నగరాల్లో నివసించే మరియు వారి సంఘాలలో భాగమైన పేదలకు పొప్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.

"మదర్ ఆఫ్ మెర్సీ" క్లినిక్, సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లోని కొలొనేడ్ కింద 2015లో.
స్థాపించబడింది, నవంబర్ 11 నుండి ఒక వారం పాటు వారి సేవలు అందిస్తారు.

ఇది ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది, అవసరమైన వారికి వైద్య సంరక్షణను అందిస్తుంది.

క్లినిక్‌లో 46 మంది వైద్యులు, 8 మంది నర్సులు మరియు 10 మంది వాలంటీర్లు ప్రతిరోజూ రెండు విడతలుగా తమ సేవను అందిస్తారు 

ప్రతిరోజూ ఇది సాధారణ మరియు ప్రత్యేక వైద్య సందర్శనలు, ఫ్లూ వ్యాక్సిన్‌లు, రక్త పరీక్షలు,  డ్రెస్సింగ్ మరియు ఆరోగ్య సంరక్షణ లేదా పత్రాలు లేని వారికి మందులను అందిస్తుంది.

అవసరంలో ఉన్న వారికి  సహాయం చేయడంపై దృష్టి పెట్టడం లక్ష్యం కాబట్టి ID అవసరం లేదు అని తెలిపారు 

కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, జనరల్ సర్జరీ, రుమటాలజీ, డెర్మటాలజీ, డెంటిస్ట్రీ, గైనకాలజీ, పల్మోనాలజీ, ఇఎన్‌టి, ఆంకాలజీ, అల్ట్రాసౌండ్, న్యూరాలజీ, సైక్రియాలజీ , అంటు వ్యాధులు, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, మరియు పాడియాట్రి వంటి 18 విభిన్న రంగాలకు చెందిన వైద్యుల అందుబాటులో ఉంటారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవసరమైన వారికి తెలియజేయడానికి మరియు ప్రోత్సహించడానికి  రోమ్ మేత్రాసనలోని అనేక విచారణలో వివరాల జాబితాని ప్రచారం చేసారు