సి సి బి ఐ పాస్టరల్ ప్రణాళికను చర్చించడానికి పశ్చిమ ప్రాంత పీఠాధిపతులు సమావేశం.

జూలై 10, 2024  వెస్ట్రన్ రీజియన్ (పశ్చిమ ప్రాంత)  బిషప్స్ కౌన్సిల్ (WRBC) గాంధీనగర్‌లోని జాన్ మరియ వియానీ పాస్టరల్ సెంటర్‌లో శ్రీసభ ఎదుర్కొంటున్న క్లిష్టమైన సమస్యలపై రెండు రోజుల పాటు కీలక సమావేశాన్ని నిర్వహించింది 

పోప్ ఫ్రాన్సిస్ గారు ఇటీవలి రాబోయే జూబ్లీ సంవత్సరం 2025 గాను  పలు కీలక అంశాలతో పాటు అపోస్టోలిక్ లెటర్ "డిగ్నిటాస్ ఇన్ఫినిటా" మరియు బుల్ ఆఫ్ ఇండిక్షన్‌పై ఈ సమావేశంలో పీఠాధిపతులు దృష్టి సారించింది. 
 
బొంబాయి అగ్రపీఠాధిపతులు కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్ గారు "సమకాలీన సవాళ్లు మరియు సినడ్ ఆన్ సినడాలిటీపై అంతర్దృష్టులను అందిస్తూ కీలకోపన్యాసం చేశారు.

కాన్ఫరెన్స్ ఆఫ్ కాథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా (CCBI)వారి పాస్టరల్ ప్లాన్‌లో "సినడ్ శ్రీసభ ప్రయాణం : మిషన్ 2033" పై దృష్టి సారించారు.

CCBI డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ డాక్టర్ స్టీఫెన్ అలత్తర రాబోయే CCBI ప్లీనరీ అసెంబ్లీ పాస్టోరల్ ప్లాన్ వివరణాత్మక ప్రణాళికను అందించారు మరియు ప్రిపరేటరీ డాక్యుమెంట్‌ను బహుకరించారు.

శ్రీసభలో మరియు విస్తృత సమాజంలో ఐక్యత మరియు సంఘీభావాన్ని పెంపొందించడానికి పీఠాధిపతులు తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.

2033 వరకు వెస్ట్రన్ రీజియన్‌లో శ్రీసభను బలోపేతం చేయాలనే లక్ష్యంతో వారు చర్చించిన వ్యూహాలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.