"సినడ్ మరియు సినడాలిటీ" సంగోష్టిని నిర్వహించిన సి.బి.సి.బి
బంగ్లాదేశ్ కథోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు జూన్ 27 నుండి 29 వరకు ఢాకాలోని మొహమ్మద్‌పూర్‌లోని CBCB సెంటర్లో మేత్రాసనంలోని వివిధ విచారణలకు "సినడ్ మరియు సినడాలిటీ సంగోష్టిని నిర్వహించింది.
"బంగ్లాదేశ్‌లోని వివిధ విచారణలు సినడ్ మరియు సినడాలిటీ " అనే అంశాన్ని అన్ని స్థాయిలలో పరిచయం చేయడానికి, అవగాహన కల్పించడానికి మరియు దానిని లోతుగా అర్ధం చేసుకోడానికి ఈ సంగోష్టి యొక్క ముఖ్య లక్ష్యం.
ఈ సంగోష్ఠి FABC-OSC ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ జార్జ్ ప్లాతోట్టం, SDB మరియు వాటికన్లోని సినడ్ సెక్రటేరియట్ అండర్ సెక్రటరీ XMCJ సిస్టర్ నథాలీ బెక్వార్ట్ గార్ల నాయకత్వంలో జరిగింది.
కార్డినల్ మహా పూజ్య పాట్రిక్ డి'రోజారియో గారు, ఢాకా అగ్రపీఠాధిపతులు మహా.పూజ్య బెజోయ్ ఎన్. డి'క్రూజ్ గారు మరియు పలువురు పీఠాధిపతులు, గురువులు, గురువిద్యార్థులు,మఠకన్యలో, విశ్వాసులు మరియు కథోలిక సంస్థల అధిపతులతో సహా సుమారు 80 మంది ఈ సంగోష్ఠిలో పాల్గొన్నారు.
తన ప్రారంభ వ్యాఖ్యలలో, "సినడల్ చర్చి" అనే భావన మన సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిందని, దానిని క్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి చేసిన ప్రయాణంతో పోల్చారు మహా పూజ్య పోనెన్ పాల్ కుబి గారు."సినడాలిటీ అంటే కలిసి క్రీస్తు ప్రభుని బాటలో నడవడం" అని ఆయన పేర్కొన్నారు.
సినడల్ ప్రక్రియ అనగా "క్రీస్తు వాక్యాన్ని జీవించడం, ఆయన బోధనలను వ్యాప్తి చేయడం మరియు క్రైస్తవ సేవను అందించడం" అని ఢాకా అగ్రపీఠాధిపతులు మహా.పూజ్య బెజోయ్ ఎన్. డి'క్రూజ్ గారు అన్నారు
మన జగత్గురువులు పొప్ ఫ్రాన్సిస్ గారి ప్రేరణ పొందడం ద్వారా అంతర్గత సంఘర్షణలు మరియు బాహ్య ప్రభావాలను అధిగమించాలనే లక్ష్యంతో ఈ సినడ్ కు పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా పరస్పర గౌరవం మరియు సహకారాన్ని పెంపొందించడానికి పవిత్రఆత్మ శక్తి కూడా అందరికి అవసరం అని గురుశ్రీ జార్జ్ ప్లాతోట్టం అన్నారు .
2021లో పోప్ ఫ్రాన్సిస్ ప్రారంభించిన ఈ సినడ్ మరియు సినడాలిటీ క్రీస్తు విలువలను ప్రతిబింబిస్తూ,ప్రజలందరితో కలిసి సాగే ప్రయాణాన్ని సూచిస్తుంది.