సినడ్ (సమాఖ్య సదస్సు) చివరి సాక్షాధార పత్ర నిర్వాహక సభకి కార్డినల్ ఫిలిప్ నెరి నియామకం.
పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు అక్టోబరు 9 ,2024 న భారత కాథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ ఫిలిప్ నెరి ను కతోలిక ధర్మసభ పరిపాలన విధివిధానాల (Synod on Synodality ) చివరి సాక్షాధార పత్రాన్ని రూపొందించే బాధ్యత కమిటీకి నియమించారు.
కార్డినల్ ఫిలిప్ నెరితో పాటు, కాలిఫోర్నియా కు చెందిన సిస్టర్ లెటిసియా సలాజర్ మరియు రోమ్ నగరానికి చెందిన గురుశ్రీ గూసేప్ బాన్‌ఫ్రేట్ గార్లను కూడా పాపు గారు నియమించడం జరిగింది
14 మంది సభ్యులతో కూడిన ఈ నిర్వాహక సభలో ప్రపంచంలో 7 ప్రాంతాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు,ఎక్స్ అఫీషియో సభ్యులతో పాటు, పాపు గారు నేరుగా నియమించిన వారు ఉన్నారు
ఒట్టావాలోని సెయింట్ పాల్ విశ్వవిద్యాలయ వేదాంతవేత్త కాథరీన్ క్లిఫోర్డ్, ఆఫ్రికా మరియు మడగాస్కర్ ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్‌ల సింపోజియం అధ్యక్షులు కార్డినల్ ఫ్రిడోలిన్ అంబోంగో, ఆస్ట్రేలియా, శాండ్‌హర్స్ట్ పీఠాధిపతులు షేన్ మెకిన్లే, కొలంబియా,బొగోటాకు చెందిన కార్డినల్ లూయిస్ జోస్ రూడా అపారిసియో; మార్సెయిల్ కు చెందిన కార్డినల్ జీన్-మార్క్ అవెలైన్; మలేషియాకు చెందిన గురుశ్రీ క్లారెన్స్ దవేదాసన్; మరియు మెరోనైట్ పీఠాధిపతులు మౌనిర్ ఖైరల్లా, గార్లు ఎన్నికైన సభ్యులలో
లక్సెంబర్గ్‌కు చెందిన కార్డినల్ జీన్-క్లాడ్ హోలెరిచ్, పీఠాధిపతుల సినాడ్ సెక్రటరీ జనరల్ కార్డినల్ మారియో గ్రెచ్, మొన్సిగ్నోర్ రికార్డో బట్టోచియో, మరియు జేసు సభకు చెందిన గురుశ్రీ గియాకోమో కోస్టా గార్లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు
CCBI అధ్యక్షులు కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో, ఆగస్ట్ 27, 2022న ఫ్రాన్సిస్ పాపు గారి చేత కార్డినల్‌గా నియమింపబడ్డారు .
ఆయన 2019లో CCBI 31వ ప్లీనరీ అసెంబ్లీకి అధ్యక్షుడిగా మరియు 2022లో 33వ ప్లీనరీ అసెంబ్లీలో తిరిగి ఎన్నికకాబడ్డారు