సాల్ట్ లేక్ సిటీ దేవాలయం నుండి దొంగిలించబడ్డ పునీత మగ్దలీన మరియ అవశేషాలు

పునీత మగ్దలీన మరియ అవశేషాలు

సాల్ట్ లేక్ సిటీ దేవాలయం నుండి దొంగిలించబడ్డ పునీత మగ్దలీన మరియ అవశేషాలు

జూలై 10వ తేదీ ఉదయం కెథెడ్రల్ ఆఫ్ మడేలీన్ నుండి పునీత మరియ మగ్దలీన యొక్క అవశేషాలు దొంగిలించబడ్డాయి. ఉదయం 7 గంటల సమయంలో దేవాలయ సిబ్బందిలో ఒకరు శిలువ క్రింద నేలపై విరిగిన శేషాన్ని కనుగొన్నప్పుడు దొంగతనం జరిగినట్లు గుర్తించారు.

దేవాలయ రెక్టర్ గురుశ్రీ మార్టిన్ డియాజ్ ప్రకారం, ఇది దొంగతనం చర్యగా కనిపిస్తుంది, విధ్వంసం కాదు అని అన్నారు.

సాల్ట్ లేక్ సిటీ మేత్రాసనం యొక్క ఇంటర్‌మౌంటైన్ కథోలిక వార్తాపత్రిక ప్రకారం, "ఇది విక్రయించడానికి విలువైన వస్తువు కోసం చూస్తున్న వ్యక్తి చేసిన పని" అని గురుశ్రీ డియాజ్ చెప్పారు. "అతను శేషవస్త్రాన్ని ఎత్తుకెళ్లి ఉండవచ్చు, కానీ అతను దానిని తీసివేసినప్పుడు  చాలా బరువుగా ఉన్నందున దానిని పట్టుకోలేకపోయాడు. ఒకసారి అది విరిగితే, అతను విక్రయించదగినదిగా కనిపించిన వస్తువును తీసుకున్నాడు." అని ఆయన అన్నారు.

సాల్ట్ లేక్ సిటీ మేత్రాసనం సాల్ట్ లేక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి శేషాన్ని తిరిగి పొందేందుకు కృషి చేస్తోంది. శేషాన్ని తిరిగి ఇచ్చినందుకు లేదా దాని వాపసుకు దారితీసే సమాచారం కోసం $1,000 రివార్డ్ అందించబడుతోంది.

 

Article by: Arvind. B

Online Content Producer