వాటికన్ లో కీలక పదవులకు నియమితులైన ఇద్దరు ఫిలిపినో గురువులు

పోప్ ఫ్రాన్సిస్ గారు ఫిలిప్పీన్స్‌లోని సిబూ ప్రావిన్స్ కు చెందిన సెంట్రల్ విసయాస్ ప్రాంతంలో ఉన్న ఇద్దరు గురువులను హోలీ సీలో ముఖ్యమైన పదవులలో సేవ చేయడానికి నియమించారు.

మొన్సిగ్నోర్ జాన్ థామస్ లిమ్చువా నెదర్లాండ్స్ కింగ్‌డమ్‌లోని అపోస్టోలిక్ న్యూన్షియేచర్ కౌన్సెలర్‌గాను, గురుశ్రీ హెజ్రాన్ జుడ్ కార్టేజీనాని ఐవరీ కోస్ట్‌ అపోస్టోలిక్ న్యూన్షియేచర్
నియమించారు 

మొన్సిగ్నోర్ జాన్ థామస్ లిమ్చువా వాటికన్‌లో  2020 నుండి సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోలీ సీ లో ఒక  విభాగానికి అధికారిగా, అలాగే పాపల్ చాప్లిన్‌గా తన సేవను అందిస్తున్నారు.


అతను 2010లో సిబూ అగ్రపీఠానికి గురువుగా అభిషేకింపబడ్డారు, లిమ్చువా వాటికన్ పొంటిఫికల్ ఎక్లెసియాస్టికల్ అకాడమీలో డిప్లొమాటిక్ ఫార్మషన్ పూర్తిచేశారు.

సెప్టెంబరు 2014లో పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్ మరియు టోగోలోని అపోస్టోలిక్ న్యూన్సియేచర్స్‌లో మరియు తరువాత ఈజిప్టులో పోస్టింగ్‌లతో వారి బాట ప్రారంభం అయింది. 

తను స్పెయిన్‌ పాంప్లోనాలోని నవార్రే విశ్వవిద్యాలయంలో వేదాంతశాస్త్ర  అధ్యయనాన్ని పూర్తి చేశారు . తను రోమ్‌లోని పొంటిఫికల్ లాటరన్ విశ్వవిద్యాలయం నుండి కానన్ లాలో డాక్టరేట్ పొందారు.

గురుశ్రీ  కార్టేజీనా ఇటీవలే బ్రెజిల్‌లో మిషనరీ సంవత్సరాన్ని పూర్తి చేసి, ఐవరీ కోస్ట్‌కు అతని నియామకంతో అధికారికంగా వాటికన్ దౌత్య సేవలో చేరబోతున్నారు.

ఇద్దరూ మొన్సిగ్నోర్ లిమ్చువా మరియు గురుశ్రీ కార్టేజీనా గార్లు సెబూ నుండి గురువులుగా అభిషేకింపబడ్డ మూడవ మరియు నాల్గవ వ్యక్తులు