వాటికన్ అంతర్జాతీయ సలహా మండలికి భారతీయ యువతి ఎన్నిక
సెప్టెంబర్ 28, 2024 న వాటికన్ అంతర్జాతీయ యువజన సలహా మండలికి (IYAB) భారతదేశంలోని కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ ఫ్రెయా ఫ్రాన్సిస్ గారిని
నియమిస్తూ ప్రకటన చేసారు .
విభిన్న ప్రపంచ దృక్కోణాలను స్వీకరించడంలో శ్రీసభ చేస్తున్న ప్రయత్నాలలో ముఖ్యమైనది ఈ నియామకం.
సెప్టెంబర్ 25, 2024న డికాస్టరీ ఫర్ లేటి , ఫ్యామిలీ అండ్ లైఫ్ వారు దీనిని ప్రకటించారు.
జీసస్ యూత్ మూవ్‌మెంట్‌కు చెందిన డాక్టర్. ఫ్రెయా తన మూడేళ్ల పదవీకాలంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు .
హోమియోపతిలో గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్ ఫ్రెయా ప్రస్తుతం తమిళనాడు, కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో యూనిట్ డాక్టర్ గా పని చేస్తున్నారు.
కతోలిక విశ్వాస కుటుంబంలో పెరిగిన ఆమె విశ్వాస ప్రయాణం జీసస్ యూత్ మూవ్‌మెంట్‌తో రూపుదిద్దుకుంది.
క్యాంపస్ లో ప్రార్థన బృందంతో ప్రారంభించి, ఆమె క్రమంగా నాయకత్వ పాత్రలకు ఎదిగింది, విభిన్న మఠసంస్థలతో పని చేయడంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది మరియు పరిచర్య పట్ల దయగల విధానాన్ని అభివృద్ధి పరుచుకుంది.
ప్రస్తుతం తమిళనాడు ప్రాంతీయ సహాయ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు.
డాక్టర్. ఫ్రెయా ఒక ఫ్రీస్టైల్ డ్యాన్సర్, గిటారిస్ట్ మరియు ఆసక్తిగల రీడర్ కూడా.
డికాస్టరీ స్థాపించిన IYABలో వివిధ ప్రాంతాలు మరియు విశ్వాస నేపథ్యాల నుండి 20 మంది యువకులు ఉన్నారు.
వారు యువజన పరిచర్య మరియు శ్రీసభలో ఇతర ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారిస్తారు
ఈ నియామకం మతపరమైన విషయాలలో యువత నిమగ్నమవ్వడానికి తోడ్పడుతుందని మరియు ప్రపంచ శ్రీసభలో భారత దేశ ప్రాముఖ్యత పెంచుతుంది
భారతదేశం శ్రీసభ డాక్టర్ ఫ్రెయాను అభినందిస్తూ,ఆమె విజయాన్ని కాంక్షిస్తుంది.
అమృతవాణి అధ్యక్షులు, ఏలూరు పీఠకాపరి మహా పూజ్య జయరావు పొలిమేర గారు, అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వీరిని అభినందిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియచేస్తుంది