వాటికన్‌లో కార్డినల్ల మొదటి సార్వత్రిక సమావేశం ప్రారంభం

మంగళవారం ఏప్రిల్ 22 ఉదయం వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఒక క్షణం మౌన ప్రార్థనతో కార్డినల్ల మొదటి సార్వత్రిక సమావేశం ప్రారంభించారు 

ఈ సమావేశానికి దాదాపు 60మంది కార్డినల్లు సనాడ్ హాల్‌లో గుమిగూడారు.

Apostolic Constitution Universi Dominici Gregis ప్రకారం వారు కొత్త పోపును ఎన్నుకునే ప్రక్రియను నమ్మకంగా,నియమనిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు.

అనంతరం సాంప్రదాయ పవిత్రాత్మ ప్రార్థన అయిన Adsumus పాడారు.

ఈ సందర్భంగా Universi Dominici Gregis 12 మరియు 13 పేరాలను బిగ్గరగా చదివి, sede vacante కాలంలో అనుసరించాల్సిన బాధ్యతలు మరియు విధానాలను వివరించారు.

హోలీ రోమన్ చర్చి కామెర్లెంగో కార్డినల్ Kevin Farrell కూడా పోప్ ఫ్రాన్సిస్ వీలునామాను అసెంబ్లీకి చదివి వినిపించారు.

కొత్త పోప్ నిర్ణయం తీసుకునే వరకు ప్రణాళికలో ఉన్న ధాన్యతాహోదా కల్పించే వేడుకలను నిలిపివేయాలని కార్డినల్ల మండలి నిర్ణయించింది.

హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించిన విధంగా, ఏప్రిల్ 26, శనివారం ఉదయం 10:00 గంటలకు పొప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరగనున్న తేదీలను కార్డినల్లు ధృవీకరించారు.

రెండవ సార్వత్రిక సమావేశం బుధవారం, ఏప్రిల్ 23, మధ్యాహ్నం జరగనుంది. ఉదయం పోప్ భౌతికకాయాన్ని బసిలికాకు ఆచారబద్ధంగా తరలించారు, అక్కడ ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.

సాంప్రదాయ తొమ్మిది రోజుల సంతాప దినమైన “Novemdiales”లో భాగంగా, ఏప్రిల్ 27 ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దివ్యబలి పూజను జరుపుకుంటారు. 

దీనికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ అధ్యక్షత వహిస్తారు,