వన్యప్రాణులను కాల్చడానికి అనుమతించాలని పీఠాధిపతులు ప్రభుత్వాన్ని కోరారు
వన్యప్రాణులను కాల్చడానికి అనుమతించాలని పీఠాధిపతులు ప్రభుత్వాన్ని కోరారు
దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో ఇటీవల ఆరుగురు వ్యక్తులు మరణించిన తర్వాత మానవ నివాసాలను ఆక్రమించే వన్యప్రాణులను చంపడానికి అనుమతించే నిబంధనలను సవరించాలని కథోలిక పీఠాధిపతులు ప్రభుత్వాన్ని కోరారు.
దక్షిణ కేరళలోని వాయనాడ్ జిల్లాలో నివసిస్తున్న పాల్ వెల్లచలిల్ ను ఫిబ్రవరి 16న ఏనుగుల గుంపు అతనిపై దాడి చేసి చంపాయి. వెల్లచలిల్ మృతితో స్థానికులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.
ఒక ఎకో టూరిజం సెంటర్‌లో గార్డుగా 50 ఏళ్ల వ్యక్తి ని కూడా ఏనుగుల గుంపు అతడిని తొక్కి చంపిందని స్థానికులు తెలిపారు.ఫిబ్రవరి 10న, అదే జిల్లాలో 42 ఏళ్ల అజీష్ పనాచియిల్‌ను తన ఇంటి వెలుపల ఏనుగు తొక్కి చంపింది.
ఈ రెండు హత్యలు కేరళలోని వాయనాడ్ మరియు ఇడుక్కి జిల్లాలలో జరిగాయి. ఈ సంవత్సరం వన్యప్రాణుల దాడుల కారణంగా మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ఇక్కడ గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు రైతులుగా పనిచేస్తున్నారు."గిరిజన, అడవుల దగ్గరలో నివసించే మా రైతులు కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు" అని KCBC ప్రతినిధి గురుశ్రీ జాకబ్ పాలక్కప్పిల్లి గారు అన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం గత ఎనిమిదేళ్లలో వన్యప్రాణుల కారణంగా కేరళలో 910 మంది ప్రాణాలు కోల్పోయారు.
"పౌరుల జీవితాలు మరియు ఆస్తులకు గణనీయమైన ముప్పు మరియు నష్టాన్ని కలిగించే వన్యప్రాణులను కాల్చడానికి అనుమతించే విధానాలను రూపొందించడానికి సత్వర చర్యలు తీసుకోవాలి" అని ప్రాంతీయ కేరళ కథోలిక బిషప్స్ కౌన్సిల్ (KCBC) అధ్యక్షుడు కార్డినల్ మహా పూజ్య బాసేలియోస్ క్లీమిస్ గారు ఫిబ్రవరి 18న చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కార్డినల్ కోరారు.
మన భారతదేశంలోని కఠినమైన వన్యప్రాణుల రక్షణ చట్టం అమలులో ఉంది. ఈ చట్టం వన్యప్రాణులను చంపడాన్ని నిషేధిస్తుంది మరియు వాటికి హాని కలిగించే వారికి మూడు నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
రైతులకు ఇబ్బంది కలిగించే జంతువులను కాల్చడానికి అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం “అవసరమైన చట్టాలను” సవరించాలని మేము కోరుకుంటున్నాము అని గురుశ్రీ పాలక్కపిల్లి గారు చెప్పారు.
రక్షణ గోడ ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని గురుశ్రీ పాలక్కపిల్లి గారు అన్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసితుల భద్రతకు సంబంధించిన చర్యలను ఖరారు చేసేందుకు ఫిబ్రవరి 20న వాయనాడ్‌లో ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer