"లెబనాన్ శాంతికి ఒక వ్యవస్థగా ఉండాలి - ఫ్రాన్సిస్ పాపుగారు
"లెబనాన్ శాంతికి ఒక వ్యవస్థగా ఉండాలి - ఫ్రాన్సిస్ పాపుగారు
పరిశుద్ధ ఫ్రాన్సీస్ జగద్గురువులు 2020 వినాశకరమైన పేలుడు బాధితుల కుటుంబాలను బీరుట్ (Beirut)నౌకాశ్రయంలో కలుసుకున్నారు. వారికి తన సంఘీభావం తెలియజేస్తూ మధ్యప్రాచ్యంలో శాంతిని కలగాలని కోరుతున్నారు.
కాన్‌సిస్టరీ హాల్‌లో జరిగీన సమావేశంలో 30మంది సభ్యుల ప్రతినిధి బృందానికి శుభాకాంక్షలు తెలిపిన ఫ్రాన్సిస్ పాపుగారు, లెబనీస్ కుటుంబాలకు తన సాన్నిహిత్యాన్ని తెలియజేసారు, తాను వారి కోసం ప్రార్థిస్తూనే ఉంటానని మరియు వారి దుఃఖంలో పాలుపంచుకుంటున్నానని చెప్పారు.
మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపుగారు తన ప్రసంగంలో లెబనీస్ కుటుంబాలకు సత్యం మరియు న్యాయం కోసం కొనసాగుతున్న అన్వేషణలో తన మద్దతును వ్యక్తం చేశారు.యుద్ధం రాజకీయాలు మరియు మానవత్వం యొక్క వైఫల్యం అని పునరుద్ఘాటించారు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రమాదకరంగా దగ్గరగా ఉన్న ప్రాంతంలోని విస్తృత బాధలను ప్రతిబింబించారు, యుద్ధం రాజకీయాలు మరియు మానవత్వం యొక్క వైఫల్యం అని పునరుద్ఘాటించారు.
మహా పూజ్య ఫ్రాన్సిస్ పాపుగారు మరోసారి మధ్యప్రాచ్యంలో శాంతి కొరకు అభ్యర్థించారు.లెబనాన్ శాంతికి ఒక వ్యవస్థగా ఉండాలి అని ఫ్రాన్సిస్ పాపుగారు నొక్కి చెప్పారు.
ప్రార్థనలో మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా శ్రీసభ మద్దతు మీ కుటుంబాలకు నిరంతర ఉంటుందని హామీ ఇచ్చారు. "మీరు ఒంటరిగా లేరు, మరియు మేము మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టము," అని ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.
4 ఆగస్టు 2020న నగరంలోని ఓడరేవులో ఒక గిడ్డంగిలో సరిగ్గా నిల్వ చేయబడని భారీ మొత్తంలో దాదాపు 3,000 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకుని బీరూట్ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది గాయపడ్డారు మరియు లెబనీస్ రాజధాని అంతటా భవనాలకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. ఈ విపత్తు లెబనీస్ ప్రభుత్వంలోని అవినీతి, దుర్వినియోగం, నిర్లక్ష్యం వంటి సమస్యలతో పాటూ ప్రభుత్వం మరియు పోర్ట్ అధికారుల యొక్క బహుళ స్థాయిలలో వైఫల్యాలు బయటపడ్డాయి.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer