మొదలైన పునీత అంథోనివారి మహోత్సవ వేడుకలు
మొదలైన పునీత అంథోనివారి మహోత్సవ వేడుకలు
విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ పునీత అంథోని వారి పుణ్యక్షేత్రం లో నవదిన ప్రార్థనలు 31 మే 2022 న మొదలయ్యాయి. విశాఖ అతి మేత్రాసన వికార్ జనరల్, మహారాణిపేట విచారణ గురువులు గురుశ్రీ డి బాలశౌరి గారి ఆద్వర్యం లో ఈ కార్యక్రమాలు మొదలయ్యాయి. విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు పండుగ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ప్రొక్యూటర్ గురుశ్రీ కోన జయరాజు , గురుశ్రీ ప్రతాప్, గురుశ్రీ కె వేలంగాని రాజు , గురుశ్రీ రవితేజ పాల్గొన్నారు.
విచారణ ప్రజలతో పాటూ వివిధ ప్రాతాలనుండి భక్తులు రావడం జరిగినది. యువతీ యువకులు దేవాలయాన్ని కన్నుల పండుగగా తయారు చేసారు. జూన్ 13 న పునీత అంథోని వారి పండుగ జరగనున్నది. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ నవదిన ప్రార్థనలులో పాల్గొనాలని విచారణ కర్తలు సూచించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer