ముగిసిన మొదటి రోజు సమావేశం

ముగిసిన మొదటి రోజు సమావేశం

267వ పోప్‌ను ఎన్నుకోవడానికి జరిగిన సమావేశంలో మొదటి బ్యాలెట్ తర్వాత నూతన పోప్ ఎన్నిక కాలేదు.

బుధవారం సాయంత్రం 9:00 గంటలకు సిస్టీన్ చాపెల్ పై ఉన్న చిమ్నీ నుండి నల్లటి పొగ వెలువడింది, ఇది నూతన పొప్ ఎన్నికకు సంబంధించి కాన్క్లేవ్‌లో మొదటి బ్యాలెట్ నిర్వహించబడిందని మరియు నూతన పోప్ ఎన్నిక లేకుండానే ముగిసిందని సూచిస్తుంది.

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దాదాపు 45,000 మంది విశ్వాసులు చేరుకొని నూతన పొప్ కొరకు ప్రకటన కోసం ఎదురు చూశారు. సాయంత్రం 7 గంటల తర్వాత  నూతన పొప్ ప్రకటన వస్తుందని భావించినప్పటికీ, చివరికి, వారు 9 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.

సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో టాంజానియాకు చెందిన డీకన్ నికోలస్ న్కోరోంకో గారు వాటికన్ న్యూస్‌తో మాట్లాడుతూ " "కొత్త పోప్ ఎక్కడి నుండి వచ్చినా పర్వాలేదు అని , "అది ఆఫ్రికా అయినా, ఆసియా అయినా, అమెరికా అయినా, మనకు కావలసింది పవిత్రమైన పోప్ అని , శ్రీసభకి  మార్గనిర్దేశం చేసే  పోప్ మనకు అవసరం" అని అన్నారు.

 

Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer