మాకు శాంతి కావాలి - గాజా నుండి సిస్టర్ నబీలా విజ్ఞప్తి

sisternabilas appeal from gaza.

మాకు శాంతి కావాలి - గాజా నుండి సిస్టర్ నబీలా విజ్ఞప్తి

పాలస్తీనా, గాజాలోని హోలీ ఫ్యామిలీ విచారణలో క్రైస్తవులు నిరాశ్రయులైనందున, యుద్ధం వాళ్ళ  పాలస్తీనా లో బాధపడుతున్న పౌరుల ఆర్తనాదాలను వినడానికి ప్రపంచ నాయకులకు సిస్టర్ నబీలా సలేహ్ తన విజ్ఞప్తిని తెలియజేసారు.  

 ధైర్యంగా  సిస్టర్ నబీలా సలేహ్ ఇటీవల వాటికన్ న్యూస్‌కి తన విజ్ఞప్తిని వినిపించడంలో విజయం సాధించారు. ఆమె మొత్తం ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

సిస్టర్ నబీలా సలేహ్ మాట్లాడుతూ "ప్రస్తుత రోజులలో గాజాలోని వ్యక్తులతో మాట్లాడడం  చాలా కష్టంగా ఉంది అని, టెలిఫోన్ లైన్‌లు  మరియు ఇంటర్నెట్ వ్యవస్థ పునరుద్దరణ కాలేదు అని అప్పుడప్పుడు అవి పని చేస్తున్నాయి అని , ప్రతిరోజూ కొన్ని గంటలపాటు మాత్రమే కరెంటు ఉంటుంది అని అన్నారు.

"నేను ప్రపంచాన్ని శాంతి కోసం, మానవ హక్కుల పట్ల గౌరవం కోసం అడుగుతున్నాను. గాజాలో ప్రజలు బాధపడుతున్నందున నేను ప్రతి ఒక్కరినీ సహాయం చేయమని కోరుతున్నాను" అని సిస్టర్ నబీలా సలేహ్  చెప్పారు.

ఇంకా వృధా చేయడానికి ఎక్కువ సమయం లేదని ఆమె పేర్కొంటూ , "ఇళ్లు అన్ని నేలమట్టం అయ్యాయి అని , అందరికి ఆహారం అందడం లేదని  మరియు తక్కువ ఆహరం కొరకు  సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది అని సిస్టర్ అన్నారు. దేవుని దయవల్ల ఏదో ఒక మార్పు జరగగాపోతే త్వరలో మనుగడ సాధ్యం కాదని సిస్టర్ నబీలా చెప్పారు.

జెరూసలేం యొక్క జపమాల  సంఘం యొక్క సిస్టర్ మరియు విశ్వాసులు  ఇతర క్రైస్తవులు  
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వారు చిక్కుకున్నారు అని,లాటిన్-రీట్ కాథలిక్ పారిష్‌లో  ఆశ్రయం పొందుతున్నారు  అని అన్నారు.

గాయపడినవారికి ప్రాథమిక వైద్య సహాయం మాత్రమే అందిస్తున్నాము అని , అత్యవసరంగా ఆపరేషన్ చేయవలసి ఉన్న వారికీ  వైద్య సహాయం అందించలేకపోతున్నాము అని బాధపడ్డారు.

"జోర్డాన్ రాజు మా కోసం విమానాల ద్వారా ఆహారం మరియు మందులను రెండుసార్లు విడిచారు " అని సిస్టర్  పేర్కొన్నారు .

అదే సమయంలో, ఇజ్రాయెల్ ట్యాంకులు గాజా నగర వీధుల్లోకి తిరిగి వచ్చాయి."మూడు, నాలుగు రోజుల ప్రశాంతత తర్వాత, యుద్ధం మునుపటిలా హింసాత్మకంగా మారింది. ట్యాంకులు ఇరుగుపొరుగున ఉన్నాయి, అవి మా పాఠశాలకు దగ్గరగా ఉన్నాయి. మేము కాల్పులు జరుపుతున్న శబ్దాలు  విన్నాము, కానీ మాకు ఎవరికీ  ఏమీ జరగలేదు, ఆ దేవాది  దేవునికి ధన్యవాదాలు అని సిస్టర్ నబీలా అన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా  ప్రజలు ఆశలు వదులుకోలేదని సిస్టర్  నబీల చెబుతున్నారు.
మేము ప్రభువును ప్రార్దిస్తున్నాము ,అయన మీద  విశ్వాసం తో ఉన్నాము, విశ్వాసం  లేకపోతే, మేముమందరం ఇప్పటికే  చనిపోయి ఉండేవాళ్ళం అని సిస్టర్ నబీలా అన్నారు.

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer