ఫిలిప్పీన్స్‌లో (PMS) 68వ వార్షిక జాతీయ అసెంబ్లీ

జూన్ 17, 2024న, పొంటిఫికల్ మిషన్ సొసైటీస్ PMS 68వ వార్షిక జాతీయ అసెంబ్లీ ఫిలిప్పీన్స్‌లోని పల్వాన్‌లోని ప్యూర్టో ప్రిన్సేసాలోని సెయింట్ జోసఫ్ విచారణలో దివ్యబలిపూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఫిలిప్పీన్స్ కాథలిక్ బిషప్‌ల కాన్ఫరెన్స్ ఎపిస్కోపల్ కమీషన్ విభాగ మిషన్ చైర్‌పర్సన్, మహా పూజ్య సోక్రటీస్ మెసియోనా గారు "వెళ్లి అందరినీ విందుకు ఆహ్వానించండి" (మత్తయి  22:9) అనే నేపథ్యంపై ప్రసంగించారు.

“శ్రద్ధ పెంచుకొని  జాగ్రత్తగా ఉండండి. గురువులుగా మరియు మిషన్ డైరెక్టర్లుగా, మన మిషన్ ప్రాంతంలోని సంబంధిత ప్రాంతాలలో అధికారాన్ని కలిగి ఉంటాము. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే హక్కు భావం మన స్పృహలోకి నెమ్మదిగా ప్రవేశించవచ్చు, అని  హెచ్చరించారు 

పేదలు, వృద్ధులు, మహిళలు మరియు యువకులు వంటి సమాజంలోని బలహీన వర్గాల తరచుగా ఇటువంటి వేధింపులకు గురవుతున్నారని  ఆయన సూచించారు. "అధికార దుర్వినియోగానికి పాల్పడేంత వరకు మనకు తెలియకపోవచ్చు" అని పీఠాధిపతులవారు జోడించారు.

దేశవ్యాప్తంగా వివిధ మేత్రాసనాల నుండి గురువులు మరియు మిషన్ డైరెక్టర్లు హాజరైన ఈ అసెంబ్లీలో దివ్యబలిపూజ  మరియు ప్లీనరీ చర్చలలో పాల్గొన్నారు.
 
క్రీస్తు ప్రభుని భాగస్వాములుగా బాధ్యతాయుతమైన మరియు దయగల నాయకత్వాన్ని నిర్ధారించడానికి అధికారం పట్ల ఆరోగ్యకరమైన భయాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను బిషప్ మెసియోనా నొక్కి వక్కాణించారు.
"మన ప్రవర్తనను మరియు ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తామో తనిఖీ చేసే శక్తి మనకు ఎల్లప్పుడూఉండాలి," అన్నారాయన.

పోప్ పర్యవేక్షణలో ఉన్న పొంటిఫికల్ మిషన్ సొసైటీలు ప్రపంచవ్యాప్తంగా మిషనరీ యానిమేషన్ మరియు సహకారంలో కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి.

ఫిలిప్పీన్స్‌లో సంస్థ యొక్క మిషన్ మాజీ మనీలా అగ్రపీఠాధిపతులు మహా పూజ్య  మైఖేల్ ఓ'డోహెర్టీచే 1932లో స్థాపించబడినది . నేడు, మిషన్‌ను మొన్సిగ్నోర్ ఎస్టబెన్ లో, LRMS. పర్యవేక్షిస్తున్నారు.
 

Tags