ప్రధాని శ్రీ మోడీని కలిసిన CCBI ప్రతినిధి బృందం
ప్రధాని శ్రీ మోడీని కలిసిన CCBI ప్రతినిధి బృందం
జూలై 12, 2024న న్యూఢిల్లీలో కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నుండి ఒక ప్రతినిధి బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకుంది. ప్రతినిధి బృందంలో మహా పూజ్య ఆండ్రూస్ థాజత్, మహా పూజ్య జోసెఫ్ మార్ థామస్, మహా పూజ్య డాక్టర్ అనిల్ జోసెఫ్ థామస్ కూటో మరియు గురుశ్రీ సాజిమోన్ జోసెఫ్ కోయికల్ ఉన్నారు.
కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI)కి ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాధిపతుల ప్రతినిధి బృందం శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలుసుకుని మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని కోరారు. దళిత గిరిజనులకు రిజర్వేషన్లు నిలిపివేయబడతాయనే పుకార్లు పై తమ భయాందోళనలను పీఠాధిపతులు తెలియజేసారు మరియు బలవంతపు మతమార్పిడుల ఆరోపణపై క్రైస్తవులపై "పెరుగుతున్న దాడుల" గురించి ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని వారు శ్రీ మోదీని కోరారు మరియు పాపు గారిని భారతదేశానికి ఆహ్వానించడానికి శ్రీ మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను అభినందించారు.
సమావేశం అనంతరం CCBI అధ్యక్షుడు మహా పూజ్య ఆండ్రూస్ థాజత్ విలేకరులతో మాట్లాడుతూ మణిపూర్‌లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని తమతో చెప్పారని తెలిపారు. “ఇది జాతి సంఘర్షణ అని, దానికి మతపరమైన రంగు లేదని ఆయన అన్నారు. అక్కడ ప్రస్తుత పరిస్థితి గురించి మేము ఆయనకు చెప్పాము,” అని మహా పూజ్య థాజత్ అన్నారు, మణిపూర్‌లో పర్యటించమని వారు మోడీని అడగలేదని అన్నారు. మణిపూర్‌లో శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు తీవ్రంగా జోక్యం చేసుకోవాలని వారు మోదీని కోరారు.
గిరిజన నేపథ్యం నుండి మారిన క్రైస్తవులకు రిజర్వేషన్‌ను రద్దు చేస్తారనే పుకార్లపై, మహా పూజ్య థాజత్ మాట్లాడుతూ, అది కేవలం పుకారు మాత్రమేనని మోదీ తమతో చెప్పారని అన్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రతినిధి బృందానికి ఈ సమస్యపై శ్రీ మోదీ నుండి సమాధానం రాలేదు. మతపరమైన వివక్షకు తావు లేకుండా దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ప్రయోజనాలను వర్తింపజేయాలని CBCI విజ్ఞప్తి చేసింది.
ఎన్జీవోలపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద నిబంధనల అంశాన్ని కూడా వారు లేవనెత్తారు. అనేక క్రైస్తవ ఎన్జీవోలు తమ ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించే సమయంలో అనవసరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వారు చెప్పారు. "ఈ సంస్థలు కులం మరియు మతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా సామాజిక అభ్యున్నతిలో లోతుగా పాల్గొంటున్నాయి" అని ప్రతినిధి బృందం లేఖలో పేర్కొంది.
Article by: Arvind Bandi.
Online Content Producer